TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, ఐదుగురు సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం

వారు రాజీనామాలు సమర్పించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై అడిగారు. నిన్న సాయంత్రం..

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, ఐదుగురు సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం

Janardhan Reddy Resigns For TSPSC Chairman Post (Photo : Google)

Updated On : January 10, 2024 / 2:28 PM IST

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. అలాగే ఐదుగురు సభ్యుల రాజీనామాలకు కూడా ఆమోదముద్ర వేశారు. గత నెలలో టీఎస్‌పీఎస్సీకి ఛైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వారు రాజీనామాలు సమర్పించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై అడిగారు. నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరి రాజీనామాలను ఆమోదించడానికి తమకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా సర్కారు తెలిపింది. న్యాయ సంబంధిత అభిప్రాయాలను కూడా తీసుకున్నారు.

గతంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని తమిళిసై సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పారు. కాగా, కొత్త బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకానికి తమిళిసై అనుమతించారు.

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు..! గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి?