RTC Buses : కర్ఫ్యూ ఉన్నా ఆగవు.. ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సర్వం బంద్ కానున్నాయి. అయితే, బస్సు ప్రయాణికులకు మాత్రం బిగ్ రిలీఫ్ లభించింది. కర్ఫ్యూ ఉన్నా టీఎస్ ఆర్టీసీ బస్సులు యథాతథంగానే తిరగనున్నాయి. అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడం, ప్రజా రవాణపై షరతులు పెట్టకపోవడంతో ప్రగతి రథచక్రాలు ఎప్పటిలాగే తిరగనున్నాయి.

Govt Allows RTC To Run Buses During Curfew : తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సర్వం బంద్ కానున్నాయి. అయితే, బస్సు ప్రయాణికులకు మాత్రం బిగ్ రిలీఫ్ లభించింది. కర్ఫ్యూ ఉన్నా టీఎస్ ఆర్టీసీ బస్సులు యథాతథంగానే తిరగనున్నాయి. అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడం, ప్రజా రవాణపై షరతులు పెట్టకపోవడంతో ప్రగతి రథచక్రాలు ఎప్పటిలాగే తిరగనున్నాయి.

ఆర్టీసీ బస్సు టికెట్లు చూపించి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆర్టీసీ అధికారులు చెప్పారు. కర్ఫ్యూ ఉన్నా నిబంధనలు పాటిస్తే ప్రయాణాలు చేసుకోవచ్చన్నారు. ఇక బస్సులు ఎలా నడపాలి అన్న దానిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండటంతో బస్సులు రాత్రి 10 గంటలకే డిపోలకే చేరతాయని అధికారులు తెలిపారు.

10 గంటల తర్వాత ఎలాంటి రాకపోకలు ఉండకూడదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజారవాణలో బస్సులు కీలక పాత్ర పోషిస్తుండగా, ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారిపై కొంత ఎఫెక్ట్ కనిపించనుంది. ఎక్కువగా రాత్రి ప్రయాణాలు పెట్టుకునే వారు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది.

ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా యథాతథంగానే నడవనున్నాయి. ఇప్పటికైతే ప్రైవేట్ బస్సులపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించ లేదు. దీంతో కర్ఫ్యూ ఉన్నా ప్రజారవాణ మాత్రం ఎప్పటిలానే కొనసాగనుంది.

మెట్రో రైలు సమయాల్లో మార్పులు:
బస్సులు సంగతి ఇలా ఉంటే… హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మాత్రం రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇవాళ్టి(ఏప్రిల్ 20,2021) నుంచి ఈ నెల 30 తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. యథావిధిగా మొదటి రైలు ఉదయం 6.30 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. ప్రయాణికులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కు, శానిటైజర్లు వాడాలని మెట్రో అధికారులు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు