టీఆర్ఎస్‌, ఎంఐఎం సీట్లకు గండికొడుతున్నబీజేపీ

50డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజ ఉంది. ఎంఐఎం 20డివిజన్లలో ముందంజలో ఉన్నా 17డివిజన్లలో విజయం కన్ఫామ్ అయింది. ఏఎస్ రావు నగర్లో గెలిచిన కాంగ్రెస్, ఉప్పల్ లో కూడా గెలిచేట్లుగా కనిపిస్తుంది.

టీఆర్ఎస్ 60కి పైగా గెలిచేలా కనిపిస్తుండగా బీజేపీ, ఎంఐఎం 30డివిజన్లకు దగ్గరయ్యేలా కనిపిస్తుంది. టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లతో సంబంధం లేకుండా విజయం సాధించాలనుకుంటే 76మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాల్సిందే.

 

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

టీఆర్ఎస్ గట్టి పట్టున్నట్లు భావించిన ప్రాంతాల్లో బీజేపీ గణనీయ సంఖ్యలో ఓట్లను కొల్లగొట్టింది. ఎల్బీ నగర్ లాంటి ఏరియాల్లో బీజేపీ దూసుకొచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో దూసుకెళ్తున్న బీజేపీకి ఇప్పిటికే 30డివిజన్లలో విజయం ఖాయం కాగా, మరో ఐదారు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ గత ఫలితాలు, గెలుస్తుందని భావించిన ప్రాంతాల్లో ఎంఐఎంలు దూసుకొస్తుండటంతో డివిజన్లకు గండి కొడుతున్నట్లుగా కనిపిస్తుంది.

ప్రస్తుతం 44డివిజన్లలో ఎంఐఎం కార్పొరేటర్లుఉన్నారు. వాటిల్లో బీజేపీ కూడా స్థానం దక్కించుకుంది. మరోవైపు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న కొన్ని డివిజన్లలో బీజేపీ వృద్ధి కనబరుస్తుండటంతో ఇది సాధారణ విజయం కాదన్నట్లుగా మారింది.