Groom End Life : పెళ్లి అయిన రాత్రే వరుడు ఆత్మహత్య
పెళ్లి సంబరం తీరనేలేదు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు పచ్చదనం తగ్గనేలేదు. ఇంటికొచ్చి పెళ్లి అతిథుల సందడి అలాగే ఉంది. వధువు మెడలో కట్టిన పుస్తెల తాడు పసుపు తడి ఆరనేలేదు. ఇంతలోనే పెళ్లి అయిన కొద్ది గంటలకే వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

Groom Commit Suicide
Groom End life : పెళ్లి సంబరం తీరనేలేదు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు పచ్చదనం సందడి అలాగే ఉంది. వధువు మెడలో కట్టిన పుస్తెలతాడు పసుపు తడి ఆరనేలేదు.ఇంతలోనే పెళ్లి జరిగిన కొద్ది గంటలకే వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో ఆదివారం (జూన్ 20,2021)న ఈ అత్యంత విషాదకర ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన రోజు రాత్రే వరుడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కాళ్ల పారాణి ఆరకముందే వధువు జీవితాన్ని చీకటి చేసేసింది.
తనగాల గ్రామంలో ఆవుల సూర్యబాబు అనే 23 ఏళ్ల యువకుడికి ఆదివారం మధ్యాహ్నా వివాహం అయ్యింది. అనంతరం ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ వరుడు వివాహం జరిగిన రాత్రే వారి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీంతో ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టిన నవ వధువు జీవితం అంథకారమైంది.