ISKP Terror Organization : ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు

ఇటీవల సుమేరా భాను మాడ్యుల్ సభ్యులు గుజరాత్ ఏటీఎస్ కు దొరికిపోయారు. హైదరాబాద్ టోలిచౌకీకి చెందిన ఖతిజా వారికి ఆన్ లైన్ లో టచ్ లోకి వచ్చినట్లుగా గుర్తించారు. 

ISKP Terror Organization : ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు

ISKP terrorist organisation

Gujarat ATS : ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక సూత్రధారి సుమేరా భానును గుజరాత్ ఏటీఎస్ విచారిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ లలో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. ఇటీవల సుమేరా భాను మాడ్యుల్ సభ్యులు గుజరాత్ ఏటీఎస్ కు దొరికిపోయారు. హైదరాబాద్ టోలిచౌకీకి చెందిన ఖతిజా వారికి ఆన్ లైన్ లో టచ్ లోకి వచ్చినట్లుగా గుర్తించారు.  ఖతిజాతో కలిసి హైదరాబాద్ లో కుట్ర చేసేందుకు స్కెచ్ వేసినట్లు గుజరాత్ ఏటీఎస్ విచారణలో తేలింది.

ఐఎస్ కేపీ మాడ్యుల్ లో గుజరాత్ ఏటీఎస్ లో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పలుచోట్ల సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. గుజరాత్ ఏటీఎస్ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కీలక నేతగా ఉన్నటువంటి సుమేరా భానును ప్రస్తుతం బోరుబందర్ లో ఉన్న హోటల్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Amarnath Yatra : అమరనాథ్ యాత్రకు మూడంచెల అధునాతన భద్రత

ప్రస్తుతం ఆమె ఐఎస్ కేపీ మాడ్యుల్ మేడ్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కొసర్కాన్ ప్రావీన్స్ అనే ఇస్లామిక్ సంబంధించిన ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యురాలిగా ఆమె కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది సభ్యులతో ఆమె సంప్రదింపులు జరిపారు. ఆఫ్ఘనిస్తాన్ ను స్పెషల్ స్టేటస్ ఇస్లామిక్ రాజ్యం స్థాపన కోసం వీరందరూ బోరుబందర్ నుంచి జలమార్గం ద్వారా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు.

వీరంతా ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ చేరేందుకు బోటు ద్వారా వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారంటూ గతంలో జూన్ 10వ తేదీన గుజరాత్ ఏటీ ఎస్ అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర కొన్ని ఆధారాలు సేకరించారు. వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి హైదరాబాద్ లో ఇటీవల మూడు రోజుల క్రితం వరంగల్ తో పాటు పెద్దపల్లి, హైదరాబాద్, కడప పోలీస్ స్టేషన్ లలో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు వారికి 160 సీఆర్ సీపీ నోటీసులు జారీ చేసింది.