Warangal Gun culture : వరంగల్ రౌడీ షీటర్ సూరి కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
Warangal Gun culture: వరంగల్ రౌడీషీటర్ సూరి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Rowdysheeter Suri
Warangal Gun culture: వరంగల్ రౌడీషీటర్ సూరి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి హైదరాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లో దందా చేస్తున్నట్లుగా గుర్తించారు. వరంగల్ నగరాన్ని సూరి గ్యాంగ్ అడ్డాగా మార్చుకుంది. మోయిన్, మునీర్, సూరిగా చలామని అవుతూ దాసరి సురేందర్ దందాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ హత్యకోసం సుపారీ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లాలో ఓ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని హత్య చేసేందుకు సూరి గ్యాంగ్ జిల్లాలో రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, నిందితులు అందుబాటులో లేక పోవడం.. మర్డర్ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో గన్ ఫైర్ కు గ్యాంగ్ తెగబడినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. అరెస్టు సమయంలో పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లుగా సమాచారం.
జిల్లా కేంద్రంలోని బాంబుల గడ్డలో హత్యకు గురైన బాసిత్ సమాధి వద్ద గ్యాంగ్ రెండు రౌండ్ల కాల్పులు జరిపింది. రౌడీషీటర్ సూరి గ్యాంగ్ పై హనుమకొండ జిల్లా శాయంపేటలో కేసు నమోదైంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ముఠా నుంచి రెండు వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు.
