Gunfire Near SBI Head Office ATM in Koti (Pic: 10TV)
Hyderabad: హైదరాబాద్‌లోని కోఠిలో ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎమ్ వద్ద కాల్పుల కలకలం చెలరేగింది. ఇవాళ ఉదయం 7 గంటలకు రిన్షద్ అనే వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు.
రిన్షద్‌ను ఫాలో అయిన దుండగులు.. అతడిపై గన్‌తో కాల్పులు జరిపి రూ.6 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో రిన్షద్ కాలికి బులెట్ గాయం అయింది. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనాస్థలిలో సుల్తాన్ బజార్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Also Read: గని కుప్పకూలి 200 మందికిపైగా మృతి.. సజీవంగా మట్టిలో కూరుకుపోయి..
దుండగులు TS08HN 8582 నంబర్ ప్లేటు ఉన్న బ్లాక్ కలర్ యాక్టివాపై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిన్షద్‌ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు.
కోఠిలో జరిగిన కాల్పుల ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వివరాలు తెలిపారు. “ఇవాళ ఉదయం 6.50 -7 గంట మధ్య దుండగులు కాల్పులు జరిపారు. రిన్షద్ డబ్బులు డిపాజిట్ చేయడంపై దుండగులు రిక్కి నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తోంది.
రిన్షద్ నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారి. అతడిపై కాల్పులు జరపడంతో అక్కడే కుప్పకులాడు. రిన్షద్ తెచ్చిన రూ.6 లక్షల నగదతో పాటు అతడి బైక్‌ను కూడా తీసుకుని దుండగులు పరారయ్యారు. 5 టీమ్‌లతో దుండగులను గాలిస్తున్నాం. రిన్షద్‌కు ప్రాణాపాయం లేనట్లు వైద్యులు నిర్ధారించారు” అని అన్నారు.