Harish Rao: వారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్క మంచి పనైనా జరిగిందా అని హరీశ్‌రావు నిలదీశారు.

Harish Rao: వారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది: హరీశ్ రావు

Updated On : January 26, 2025 / 8:49 PM IST

కాంగ్రెస్‌ సర్కారుపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని చెప్పారు. గ్యారంటీల పేర్లతో ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారని అన్నారు.

సిద్ధిపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ… ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండా సీఎం రేవంత్‌ రెడ్డి ఒక్క ఉపన్యాసం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను, కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదని ఆయన అన్నారు.

Also Read: ఏపీలో మంత్రులకు రేటింగ్ టెన్షన్..! చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?

దేవుళ్ల మీద ఒట్టు వేసి రేవంత్‌ రెడ్డి అప్పట్లో దేవుళ్లను మోసం చేశారని, ఇప్పుడేమో రిపబ్లిక్‌ డే సాక్షిగా అందరికీ ఇస్తానని చెప్పి మళ్లీ కొందరికే అంటూ అంబేద్కర్‌ను సైతం మోసం చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్క మంచి పనైనా జరిగిందా అని హరీశ్‌రావు నిలదీశారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బంద్‌ అయ్యాయని హరీశ్ రావు అన్నారు. ఈ విషయాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన, కులగణన, గ్రామసభల పేర్ల మీద దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకోవడమే చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పారని తెలిపారు. అప్పట్లో ఏ దరఖాస్తూ లేకుండానే కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు.