సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్… ఆధారం చూపిస్తే రాజీనామా చేస్తానంటూ…

బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని హరీశ్ రావు చెప్పారు.

Harish Rao

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఇవాళ హరీశ్ రావు హైదరాబాద్‌లో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి 21 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇచ్చినట్లు ఆధారం చూపిస్తే తాను రాజీనామా చేస్తానని అన్నారు.

బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని హరీశ్ రావు చెప్పారు. ఎన్నికలు జరిగితే వంద సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకుంటామని చెప్పారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని అన్నారు.

Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు పట్టిన శని.. వాటి పీడ వదిలించాలి: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటామని హరీశ్ రావు చెప్పారు. పోలీస్, ఇతర అధికారులకు ఇదే తన హెచ్చరిక అని, రాబోయేది తమ ప్రభుత్వమేనని తెలిపారు. 12 వేల కోట్ల రూపాయలను నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని చెప్పారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షలు చేస్తున్నారా? అని హరీశ్ రావు అన్నారు.