HB Hanu Charan: విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన ఆరేళ్ల బాలుడు హను చరణ్
హను చరణ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా ఎదగాలని తాము భావిస్తున్నట్లు అతని తల్లిదండ్రులు మౌనిక, సంతోష్ కుమార్ తెలిపారు.

Hanu Charan
HB Hanu Charan: హైదరాబాద్‌లోని నిజాంపేట, గ్రీన్ కోర్టు అపార్ట్‌మెంట్ కు చెందిన ఆరేళ్ల బాలుడు హను చరణ్ 154వ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తమ ఇంటి వద్దే అతిపెద్ద గాంధీ చిత్రాన్ని వేసి విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఈ చిత్రం 10 అడుగుల ఎత్తు, ఏడు అడుగుల ఆరు అంగుళాల వెడల్పుతో ఉంది.
కేవలం 2 గంటల్లో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని వేసి, హనుచరణ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ కార్యక్రమాన్ని ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’ గా నమోదు చేస్తున్నట్లు విశ్వగురు ప్రతినిధి డాక్టర్ ఎమ్ఆర్ఎస్ రాజు ప్రకటించారు. హను చరణ్ మూడేళ్ల వయసు నుంచే డ్రాయింగ్, పెయింటింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నాడు.
హను చరణ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా ఎదగాలని తాము భావిస్తున్నట్లు అతని తల్లిదండ్రులు మౌనిక, సంతోష్ కుమార్ తెలిపారు. ప్రముఖ కళాకారుడు సత్యవోలు రాంబాబు వద్ద హనుచరణ్ ‘సద్గురు ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’ లో చిత్రలేఖనం నేర్చుకుంటున్నాడు. ఈ సందర్భంగా సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ “హనుచరణ్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. చాలా అంకితభావంతో ఉంటాడు. అతను భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు.

Hanu Charan
TSRTC: దసరాకు టీఎస్ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలేనట