హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు.

Hyderabad Rain : హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, తార్నాక, ఉప్పల్, రామంతాపూర్, పంజాగుట్ట, ఓయూ ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, మలక్ పేట్, చైతన్యపురి ఏరియాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వాన కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని.. రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Also Read : బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ దర్శనం ఎప్పుడు? ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారు?
వర్షపాతం వివరాలు..
గోల్కొండ ఏరియాలో 9 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు..
ఖైరతాబాద్ లో 8 సెంటీమీటర్లు,
ఆసిఫ్ నగర్ లో 8 సెంటీమీటర్లు,
నాంపల్లిలో 6 సెంటీమీటర్లు,
రాజేంద్రనగర్ లో 6 సెంటీమీటర్లు,
హిమాయత్ నగర్ లో 6 సెంటీమీటర్లు,
సికింద్రాబాద్ లో 6 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు.