హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్.. ఇవాళ మధ్యాహ్నం తరువాత ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. బయటకు రావొద్దు..

హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురుస్తుందని..

హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్.. ఇవాళ మధ్యాహ్నం తరువాత ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. బయటకు రావొద్దు..

Hyderabad Rains

Updated On : August 11, 2025 / 10:41 AM IST

Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. నాలుగు రోజులుగా సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడి కుండపోత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంకుతోడు ఈదురుగాలులు తోడవుతుండటంతో చెట్లు విరిగి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే, ఇవాళ కూడా హైదరాబాద్‌ నగరంలో వర్షం దంచికొట్టనుంది. మధ్యాహ్నం తరువాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందట.

హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. మధ్యాహ్నం తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.

మధ్యాహ్నం తరువాత అంటే.. 2గంటల తరువాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వర్షం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో 25 నుంచి 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.