Heavy traffic jam: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రద్దీ
ఈ టోల్ ప్లాజా మీదుగా సామాన్యంగా ప్రతి రోజు సుమారు 36,000 వాహనాలు వెళ్తుంటాయి.

సంక్రాంతి పండగ కోసం సొంత ఊర్లకు వెళ్లిన వారు మళ్లీ ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉండడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా కనపడుతున్నాయి.
అక్కడ వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. దాదాపు అర్ధ కిలోమీటరు మేర ట్రాఫిక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోల్ ప్లాజా మీదుగా సామాన్యంగా ప్రతి రోజు సుమారు 36,000 వాహనాలు వెళ్తుంటాయి.
అయితే, పండగ ఉండడంతో జనవరి 9 నుంచి నేటి వరకు ప్రతిరోజు 70-80 వేల మధ్య వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. రేపు కూడా రద్దీ ఇలాగే ఉండే అవకాశం ఉంది. సంక్రాంతికి చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో హైదరాబాద్‌లోని రోడ్లన్నీ కొన్ని రోజుల పాటు ఖాళీగా కనపడ్డాయి.
ఇప్పుడు మళ్లీ రద్దీ నెలకొంటోంది. తెలంగాణలోని కళాశాలు సెలవుల తర్వాత ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి. ఇక పాఠశాలలు 18 నుంచి తెరుచుకున్నాయి.
Mukesh Ambani: డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ముకేశ్ అంబానీ, నీతా అంబానీ