Mukesh Ambani: డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ముకేశ్ అంబానీ, నీతా అంబానీ
రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్పేశ్ మెహతా కూడా ఈ సందర్భంగా ముకేశ్ దంపతులతో ఫొటోలు దిగారు.

అమెరికా అధ్యక్షుడిగా సోమవారం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న పలువురు అతిథులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి కూడా ఆహ్వానం అందడంతో వారు ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో వారు ఫొటో దిగారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఏర్పాటు చేసిన రిసెప్షన్ డిన్నర్‌కు కూడా ముకేశ్ అంబానీకి ఆహ్వానం అందింది.
ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తుండగా, ఆదివారం “క్యాండిల్ లైట్ డిన్నర్” ఇచ్చారు. ఈ సందర్భంగానే ట్రంప్‌తో ముకేశ్ అంబానీ దంపతులు ఫొటోలు దిగారు.
ఈ డిన్నర్ పార్టీకి ముకేశ్ అంబానీ బ్లాక్ సూట్‌లో రాగా, నీతా అంబానీ ఓవర్ కోట్, ఎమరల్డ్స్‌తో కూడిన నల్లని చీరకు వేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్పేశ్ మెహతా ఈ సందర్భంగా ముకేశ్ దంపతులతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
View this post on Instagram
Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికల వేళ ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ