Youth Congress Leaders Fight : కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు.. గాంధీభవన్‌లో హైటెన్షన్..

యూత్ కాంగ్రెస్ కు సంబంధించి రాష్ట్ర ఇంచార్జ్ గా ఉన్న ఒక వ్యక్తి దీని వెనుక చక్రం తిప్పారని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు.

Youth Congress Leaders Fight : గాంధీభవన్ లో కాంగ్రెస్ యూత్ సమావేశం రసాభాసగా మారింది. యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. యూత్ కాంగ్రెస్ నాయకులు పరస్పరం కొట్టుకున్నారు.

పరస్పరం దాడులు చేసుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..
గాంధీభవన్ లో ఇవాళ యూత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం రసాభాసగా మారింది. రెండువర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఇష్యూతో ఇది మొదలైందని తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చీకటి కార్తిక్ అనే వ్యక్తి వేరే పార్టీ నుంచి వచ్చారు.

Also Read : రాష్ట్రంలో వీరందరికీ రేషన్‌ కార్డులు ఇస్తాం.. ఆ భూములకు ఏడాదికి రూ.12 వేలు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

అర్హత లేకున్నా అధ్యక్షుడిగా నియమించారంటూ ఆరోపణలు..
ఆయనకు దాదాపు 40ఏళ్లు ఉన్నా, యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకున్నా.. ఆయనను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారంటూ.. అపోజిషన్ గా పోటీ చేసిన సుధీర్ అనే వ్యక్తి ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత కొట్టుకునే వరకు మ్యాటర్ వెళ్లింది.

సుధీర్ ను టార్గెట్ చేసిన కార్తిక్ వర్గం..
సుధీర్ ను టార్గెట్ చేసిన చీకటి కార్తిక్ వర్గం.. దాడికి దిగారు. ఈ దాడిలో సుధీర్ కు గాయాలయ్యాయి. దీంతో గాంధీభవన్ లో హైటెన్షన్ నెలకొంది. అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. గాంధీభవన్ ఆవరణలో బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి రానివ్వకుండా ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై పార్టీ వర్గాలు స్పందించాయి. ఇది ఇంటర్నల్ వ్యవహారం అని, కాస్త ఆవేశంలో జరిగిందని, తాము సరిచేసుకుంటామని వెల్లడించాయి.

ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆవేదన..
కాగా, సుధీర్ మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ కు సంబంధించి రాష్ట్ర ఇంచార్జ్ గా ఉన్న ఒక వ్యక్తి దీని వెనుక చక్రం తిప్పారని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. అర్హత లేకున్నా దాదాపు 40ఏళ్ల వయసున్న చీకటి కార్తిక్ కి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కేటాయించారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్(ఆధార్, ఓటర్ ఐడీ) కూడా మీడియాకు ఇచ్చారు సుధీర్. దీన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి జరిగిందని సుధీర్ వాపోయారు.

 

Also Read : ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారు- కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు