రాష్ట్రంలో వీరందరికీ రేషన్ కార్డులు ఇస్తాం.. ఆ భూములకు ఏడాదికి రూ.12 వేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
అర్హులైన వారందికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో అర్హత ఉండే చివరి వ్యక్తి వరకూ రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 40,000 మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని విమర్శించారు.
తాము 40 లక్షల మందికి లబ్ధిచేకూరేలా రేషన్ కార్డుల విధానంలో మార్పులు చేసి అందరికీ కార్డులు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ఆరు కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నామని చెప్పారు.
అర్హులైన వారందికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యవసాయయోగ్యమైన భూములకి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వబోతున్నామని చెప్పారు. భూమిలేని రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు.
కాగా, నారాయణపూర్ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చడానికే తమ ప్రభుత్వం ప్రియారిటీ అని చెప్పారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి 70 వేల ఎకారాల అయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని, న్యాయం చేస్తామని అన్నారు.
‘డిప్యూటీ సీఎం’ ప్రచారంపై నారా లోకేశ్ రియాక్షన్.. నా టార్గెట్ ఇదే.. అసలు విషయం రివీల్..