‘డిప్యూటీ సీఎం’ ప్రచారంపై నారా లోకేశ్ రియాక్షన్.. నా టార్గెట్ ఇదే.. అసలు విషయం రివీల్..

సోషల్ మీడియాలో లోకేశ్‌ డిప్యూటీ సీఎం అంటూ కొందరు వారం రోజులుగా హోరెత్తిస్తున్నారు. దీనిపై వరుసగా కొందరు నేతలు కామెంట్లు చేశారు.

‘డిప్యూటీ సీఎం’ ప్రచారంపై నారా లోకేశ్ రియాక్షన్.. నా టార్గెట్ ఇదే.. అసలు విషయం రివీల్..

Nara Lokesh

Updated On : January 22, 2025 / 12:38 PM IST

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎంగా కావాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. అవి రాజకీయపరమైన కామెంట్లని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తము 94 శాతం సీట్లు ఇచ్చారని అన్నారు.

వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల పాలైందని చెప్పారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తన ఇప్పటికే చేతి నిండా పని ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలని అన్నారు.

మరోవైపు, డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీని హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు డబ్ల్యూఈఎఫ్‌ తరఫున సహకారం అందించాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు ఏపీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వాలని చెప్పారు. క్యాన్సర్, డయాబెటిక్, రెటినోపతి వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రోగనిర్ధారణ అల్గారిథమ్ లలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

దావోస్‌లో బిల్ గేట్స్‌తో భేటీ కానున్న చంద్రబాబు 
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడో రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ నేడు సీఎం చర్చలు జరుపుతారు. చంద్రబాబుతో యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు సమావేశం కానున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ఆయా సంస్థలకు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.

పాల డబ్బా జారి కిందపడిందట.. రాహుల్ గాంధీపై కేసు.. పాలు వలికిపోవడానికి, రాహుల్‌కి ఏం సంబంధం?