పాల డబ్బా జారి కిందపడిందట.. రాహుల్ గాంధీపై కేసు.. పాలు వలికిపోవడానికి, రాహుల్‌కి ఏం సంబంధం?

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే.

పాల డబ్బా జారి కిందపడిందట.. రాహుల్ గాంధీపై కేసు.. పాలు వలికిపోవడానికి, రాహుల్‌కి ఏం సంబంధం?

Updated On : January 22, 2025 / 12:03 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విన్న తాను షాక్‌కు గురయ్యానని, తన చేతిలో నుంచి పాల డబ్బా జారిపోవడంతో అందులోని పాలు వలికిపోయి రూ.250 నష్టం వాటిల్లిందని ఓ వ్యక్తి కేసు వేశాడు.

ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి వ్యవస్థను స్వాధీనం చేసుకున్నాయని అన్నారు.

ఆ రెండింటితో పాటు భారత రాజ్యంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆ సమయంలో తాను ఆ వ్యాఖ్యలు విని విస్మయానికి గురయ్యాయని సోనుపుర్ గ్రామ వ్యక్తి ముకేశ్ చౌదరి చెప్పాడు. తన చేతిలోని పాలు కింద పడిపోయాయని అన్నాడు. పాలు 5 లీటర్లు ఉంటాయని, అవి రూ.250 ఖరీదు చేస్తాయని తెలిపాడు.

రాహుల్ గాంధీ తీవ్ర కామెంట్స్ చేస్తూ భారత దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఆయన చేసిన షాకింగ్‌ కామెంట్ల వల్ల తనకు రూ.250 నష్టం వాటిల్లిందని ముకేశ్ చౌదరి.. రోసెరా సబ్ డివిజన్‌లోని సివిల్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలియరాలేదు.

మరోవైపు, రాహుల్ కామెంట్లపై దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్‌పై అసోంకు చెందిన మోంజిత్ చెటియా అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేశారు. రాహుల్‌ కామెంట్స్‌ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన చెప్పారు.

One year BEd: మళ్లీ వన్‌ ఇయర్‌ బీఈడీ? పూర్తి వివరాలు..