Danam Nagender : ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోళ్లు అంటూ.. కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

ఫార్ములా ఈ కార్ రేస్ తో పాటు పలు అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు పీసీసీ దృష్టికి వెళ్లాయి.

Danam Nagender : ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోళ్లు అంటూ.. కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Updated On : January 22, 2025 / 4:43 PM IST

Danam Nagender : హైదరాబాద్ చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్ చల్ చేశారు. షాదాన్ కాలేజీ ఎదురుగా జరుగుతున్న కూల్చివేతలను అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారు అంటూ అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచి బతకానికి వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు దానం నాగేందర్. దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చింతల్ బస్తీలో కొన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు వాటిని కూల్చివేసేందుకు వెళ్లారు. అయితే, కూల్చివేతలను ఎమ్మెల్యే దానంన నాగేందర్ అడ్డుకున్నారు. గతంలో హైడ్రా విషయంలో ఏదైతే జరిగిందో తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Also Read : ఆ గ్రామంలో మద్యం అమ్మితే రూ.25 వేల జరిమానా

కూల్చివేతలు ఆపకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వార్నింగ్..
కాగా, రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయని, కచ్చితంగా కూల్చివేస్తామని అధికారులు అనగా.. ఎమ్మెల్యే దానం సీరియస్ అయ్యారు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతానన్నారు.

అప్పటివరకు కూల్చివేతలు చేయొద్దన్నారు. ఒకవేళ కూల్చివేతలు చేసినట్లైతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే అడ్డుపడటంతో అధికారులు వెనక్కితగ్గాల్సి వచ్చింది.

దానం కామెంట్స్ తో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు..
మొత్తంగా దానం నాగేందర్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఒకవైపు అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తుంటే.. దానం నాగేందర్ వారిని అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఇక ఇటీవలి కాలంలో దానం నాగేందర్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చాయనే అభిప్రాయం ఉంది.

ఫార్ములా ఈ కార్ రేస్ తో పాటు పలు అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు పీసీసీ దృష్టికి వెళ్లాయి. దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది.

 

Also Read : రాష్ట్రంలో వీరందరికీ రేషన్‌ కార్డులు ఇస్తాం.. ఆ భూములకు ఏడాదికి రూ.12 వేలు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి