Dost Notification 2026 : విద్యార్థులకు అలర్ట్.. ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే.. మూడు ఫేజ్‌లలో అవకాశం..
Dost Notification 2026 : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో.. ఇక డిగ్రీ కోర్సులపై ఫోకస్ పడింది. దీంతో ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
Dost Notification 2026 released
Dost Notification 2026 : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో.. ఇక డిగ్రీ కోర్సులపై ఫోకస్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ వచ్చేసింది. మసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో డిగ్రీ అడ్మీషనర్లకు దోస్త్ 2026-27 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సోమవారం విడుదల చేశారు. మొత్తం మూడు ఫేజ్లలో్దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నేటి నుంచి అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
Also Read : TG TET : టెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ నెలలో పరీక్షలు.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే? పూర్తి వివరాలు ఇలా..
ఫేజ్-1 రిజిస్ట్రేషన్ : ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు
వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ : ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు
ఫేజ్-1 సీట్ అలాట్మెంట్ : మే 14న
సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : మే 15 నుండి 23 వరకు
ఫేజ్-2 రిజిస్ట్రేషన్ : మే 15 నుండి మే 25 వరకు
వెబ్ ఆప్షన్స్: మే 15 నుండి 26 వరకు
సీట్ అలాట్మెంట్: మే 30
ఫేజ్-3 రిజిస్ట్రేషన్ : మే 31 నుండి జూన్ 15 వరకు
వెబ్ ఆప్షన్స్: మే 31 నుండి జూన్ 16వ తేదీ వరకు
సీట్ అలాట్మెంట్: జూన్ 20
కాలేజీలకు రిపోర్టింగ్ : జూన్ 20 నుండి 27 వరకు
స్టూడెంట్స్ ఓరియంటేషన్ : జూన్ 29 నుండి 30 వరకు
క్లాసులు ప్రారంభం: జూలై 1వ తేదీన
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీలో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. డిగ్రీ దండుగ కాదు పండుగ. ఇంటర్న్‌షిప్ ఇస్తే డిగ్రీ కూడా బాగుంటుంది. ఇంజనీరింగ్ లో సీట్స్ తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది. డిగ్రీని ఇంకా బలోపేతం చేయాలని మేం చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధి ఎక్కువగా ఉండే కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. ఇన్నోవేటివ్ కోర్సులు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నామని అన్నారు.
దోస్త్‌లో మొత్తం 969 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 4,40,107 సీట్లు ఉన్నాయి. గత ఏడాది 2,05,140 సీట్లు నిండాయి. ఈ ఏడాది 121 కాలేజీలు కొత్త కోర్సులకు అప్లయ్ చేసుకున్నాయి. గత ఏడాది జీవో అడ్మిషన్స్ కాలేజీలు 54కాగా.. 60నాన్ దోస్త్ కాలేజీలపై కోర్టు కేసులు నడుస్తున్నాయి.
