Telangana Assembly Election 2023 : గ్రామాల్లో అత్యధికం…నగరాల్లో అత్యల్పం… ఇదీ గత ఎన్నికల్లో ఓటింగ్ తీరు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో గత 2009, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రికార్డులు వెల్లడించాయి.....

Voters

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో గత 2009, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రికార్డులు వెల్లడించాయి. పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించడంతోపాటు పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు అందుబాటులో ఏర్పాటుచేసినా నగర ప్రాంతాల్లోని ఓటర్లు పోలింగ్ శాతం అత్యల్పంగానే ఉంది.

ALSO READ : Money Seized : పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కలకలం.. భారీగా పట్టుబడిన నగదు

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లలో 39 నుంచి 49 శాతం పోలింగ్ జరిగింది. 2014 ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ అయిన నియోజకవర్గాల సంఖ్య ఏడుకు పెరిగింది. 2018వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్ అయిన నియోజకవర్గాల సంఖ్య 8కి పెరిగింది. మరో వైపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014 వ సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.

ALSO READ : Bandi Sanjay : ఓటుకి 10వేలు ఇస్తున్నారు- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అదే 2018వ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలో కంటే స్వల్పంగా పెరిగినా నగరాల్లో మాత్రం ఓటింగ్ అత్యల్పంగా ఉంది. నగర ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. 1962 వ సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 64గా నమోదైంది. 2018వ సంవత్సర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 73.37కు పెరిగింది.

ALSO READ : Voter Card : మీకు ఓట‌ర్ కార్డు లేదా..? ఏం తీసుకువెళ్లాలంటే..?

2009 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 72.37 శాతంగా నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరిగిన మొదటి ఎన్నికల్లో పోలింగ్ శాతం 69కి పడిపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఓటర్లు గత ఎన్నికల్లో ఓటేసేందుకు అనాసక్తి చూపించారు. ఎల్ బినగర్, చాంద్రాయణగుట్ట, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో 50 శాతం లోపే ఓట్లు పోలయ్యాయి.

ALSO READ : Telangana Polls: ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఈ రెండు రోజులు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?

నర్సంపేట, భువనగిరి, మునుగోడు, మధిర, నర్సాపూర్,ఆలేరు, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతం 90 దాటింది. పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించినా ఓటర్లు మాత్రం నగరాలు వదిలి పల్లెబాట పడుతున్నారు. దీంతో నగరాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. నగరాల్లోని సెగ్మెంట్లలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.

ALSO READ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఈవో వికాస్ రాజ్ ప్రెస్‭మీట్

గిరిజన ప్రాంతాల్లోని ఓటర్లు కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ కేంద్రాలకు నడిచి వచ్చి ఓటేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరుగుతోంది. నవంబర్ 30 వతేదీన జరగనున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత ఉంటుందనేది పోలింగ్ పర్వం ముగిస్తే గాని తెలియదు.

ట్రెండింగ్ వార్తలు