వానా కాలంలో దంచి కొడుతున్న ఎండలు..ఎందుకిలా ?

  • Publish Date - September 9, 2020 / 10:18 AM IST

Temperature In Telangana : నిండు వానాకాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎం ఎండలురా బాబు..అంటూ చెమటలు కక్కుతున్నారు. ఖమ్మంలో గరిష్టంగా 25.6 డిగ్రీలుంది. ఈ నగరంలో గత పదేళ్ల సెప్టెంబర్ నెల అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. అసలు ఎండలు ఎందుకు మండుతున్నాయి ?




ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడమే కారణమంటున్నారు వాతావరణ శాఖాధికారులు. తేమ గాలులు తెలంగాణలోకి రానందున..పొడి వాతావరణం ఏర్పడి ఎండలు మండుతున్నాయంటున్నారు. బంగాళాఖాతంలో ఏపీ తీరానికి దగ్గర 1,500 ఎత్తున ఉపరితల గాలుల ఆవర్తనం ఏర్పడిందని, దీని నుంచి తేమగాలులు తెలంగాణ వైపు బుధ, గురువారాల్లో వస్తాయని అంచనా వేస్తున్నారు.
https://10tv.in/facebook-will-pay-users-to-log-off-before-2020-election/



ఓవైపు తేమ గాలులు, మరోవైపు మేఘాలు లేనందున సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి భూ వాతావరణం వేడెక్కుతోందని, పొడి గాలులు వీస్తున్నప్పుడు గాలిలో తేమ తగ్గిపోవడం జరుగుతుందన్నారు. సాధారణంగా నమోదయ్యే టెంపరేచర్స్ కన్నా..5 డిగ్రీలు ఎక్కువ నమోదవతుందని, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణం కన్నా..20 శాతం తక్కువగా నమోదవుతోందని, సో..వీటి కారణంగా ఉక్కపోతలు ఉంటున్నాయని వెల్లడించారు.


కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండకాలాన్ని తలపించే వాతావరణం ఏర్పడుతుండడంతో కరెంటు వినియోగం పెరిగిపోయింది.