HMDA : ఫోన్ చేస్తే మట్టి గణేషుడు విగ్రహాలు మీ ఇంటికే పంపిస్తాం

వినాయక చవితి పండుగ సందర్భంగా హెచ్ఎండీఏ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది.

HMDA : ఫోన్ చేస్తే మట్టి గణేషుడు విగ్రహాలు మీ ఇంటికే పంపిస్తాం

Eco Friendly Ganesha Idols

Updated On : September 6, 2021 / 3:50 PM IST

hyderabad matti ganesh : వినాయక చవితి పండుగ వస్తోంది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గణనాథుల విగ్రహాలు దర్శమిస్తున్నాయి. కానీ పర్యావరణానికి హాని కలుగని గణేషుల విగ్రహాలనే పూజించాలని ప్రతీ ఒక్కరు మర్చిపోకూడదు. మట్టి వినాయకులనే పూజించాలని అధికారులు పదే పదే చెబుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లో మరోసారి అటువంటి నినాదాలే వినిపిస్తున్నాయి.

దీంట్లో భాగంగానే..పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్‌ఎండీఏ వినాయక మట్టి ప్రతిమలను ఇంటి వద్దే ఉచితంగా అందజేసేందుకు చర్యలు చేపట్టింది. అలా వేలాదిగా మట్టి వినాయకుడు విగ్రహాలను తయారు చేయించి ప్రజలకు పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 70 వేలకుపైగా మట్టి విగ్రహాలను తయారు చేయించింది. వాటిని ప్రజలకు పంచటానికి ఏర్పాట్లు చేసిది. అలా తయారు చేయించిన విగ్రహాలను పలు ప్రాంతాలకు తరలించి ఆయా ప్రదేశాల్లో పంపిణీ చేయనుంది.

అలా..200 విగ్రహాలు పైబడి అవసరం ఉన్న ప్రాంతంలో ఫోన్‌ చేస్తే తమ సిబ్బంది ఇంటికే తీసుకొచ్చి గణనాధుల విగ్రహాలను ఇస్తారని పురపాలకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే కొన్ని ముఖ్య ప్రాంతాల్లో మట్టి విగ్రహాల పంపిణీ ప్రారంభమైందనిఆయన తెలిపారు. ఈ నెల 6,8,9 తేదీల్లో 38 ప్రాంతాల్లో విస్తృతంగా అందజేస్తామని వెల్లడించారు. ఆదివారం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన సందర్శకులకు హెచ్‌ఎండీఏ అధికారులు ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేశారు.