School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మూడు రోజులు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు.. ఆ జిల్లాల్లో మాత్రమే..

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Holidays for schools

School Holidays: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహాశివరాత్రిని హిందువులు ఎంతో పవిత్రంగా విశ్వసిస్తారు. పరమశివుడికి ఇష్టమైన శివరాత్రికి ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తుంటారు. శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం బుధవారం (26వ తేదీ)న సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు గురువారం కూడా ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది.

Also Read: Telangana MLC elections: గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రయత్నాలు.. గట్టి పోటీ ఇస్తున్న ప్రత్యర్థులు వీరే..

ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో 26, 27 తేదీలతోపాటు మార్చి 3వ తేదీన ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 జిల్లాల్లో ఈ సెలవులు వర్తించనున్నట్లు పేర్కొన్నారు. 27వ తేదీన పోలింగ్ ఉండటంతో సెలవు ప్రకటించగా.. వచ్చే నెల మార్చి3న కౌంటింగ్ ఉండటంతో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

తెలంగాణ రాష్ట్రంలో మెదక్ – కరీంనగర్-అదిలాబాద్ – నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటు నల్గొండ – వరంగల్ – ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఉన్నందున సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులందరికీ అవకాశం కల్పిస్తూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అందుకు తగ్గట్టుగా జీవో ఇచ్చారు.