Pathagutta : పాతగుట్ట శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. ఆగస్టు 26 నుంచి పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 27, 28వ తేదీల్లో పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కళ్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం వంటి పూజలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Pathagutta Holy Festivals
Pathagutta Holy Festivals : యాదాద్రిలోని పాతగుట్టలోని శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఈవో గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 27, 28వ తేదీల్లో పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కళ్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం వంటి పూజలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Srisailam : శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజులకు రూ.3.43 కోట్ల ఆదాయం
ఆగస్టు 29వ తేదీ నుంచి యథావిధిగా నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని తెలిపారు. యదాద్రి పుణ్య క్షేత్రానికి అనుబంధంగా పాతగుట్టలోని శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొనసాగుతోంది.