Home Guard Ravinder : జీతం టైంకి ఇవ్వకపోవడం వల్లే నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు : హోంగార్డు రవీందర్ భార్య సంధ్య

తమకు జీతాలు టైంకి లేక ఇల్లు గడవక తన భర్త ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. డబ్బుల్లేక తన భర్తకు సరైన చికిత్స కూడా అందించలేకపోతున్నామని వాపోయారు.

Home Guard Ravinder : జీతం టైంకి ఇవ్వకపోవడం వల్లే నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు : హోంగార్డు రవీందర్ భార్య సంధ్య

Home Guard Ravinder wife Sandhya (1)

Updated On : September 6, 2023 / 2:21 PM IST

Hyderabad Home Guard Ravinder : జీతాలు సరిగ్గా వేయడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్ లో హోమ్ గార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. రవీందర్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసులు రవీందర్ ను ఉస్మానియా ఆస్పత్రి నుంచి అపోలో డీఆర్డీఓకు తరలించారు. రవీందర్ కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. అతని భార్య సంధ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

జీతం లేకనే తన భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య పేర్కొన్నారు. అంతేకాకుండా తన భర్త ఇలా చేసుకోవడానికి ప్రధాన కారణం పోలీసు ఉన్నతాధికారుల వేధింపులేనని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆమె 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు జీతాలు టైంకి లేక ఇల్లు గడవక తన భర్త ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. డబ్బుల్లేక తన భర్తకు సరైన చికిత్స కూడా అందించలేకపోతున్నామని వాపోయారు. ఆరోగ్య భద్రత కార్డు కూడా లేదని తెలిపారు.

Hyderabad: 3 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. 8 పేజీల లేఖ రాసి, రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలని కోరారు. తన భర్తకు జరిగిన అన్యాయం ఇంకొకరి జరగకుండా చూడాలన్నారు. హోంగార్డ్స్ అందరికీ ఆరోగ్య భద్రత కార్డు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.  అలాగే హోంగార్లందరినీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలన్నారు.

మరోవైపు హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఎఫెక్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు జీతాలు వేసింది. ప్రతిసారి 10వ తేదీన పడే జీతాలను ప్రభుత్వం ఈసారి ముందుగానే వేసింది. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నంతో హోంగార్డులకు ప్రభుత్వం జీతాలు వేసింది.