Hot Summer
Hot Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు జనం విలవిలాడిపోతున్నారు. ఇవేం ఎండలు రా నాయనా అని బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమ్మర్ మరీ హాట్ గా ఉందని, తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, ముందు ముందు మరెంత దారుణంగా ఉంటుందోనని తలుచుకుని వణికిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఇప్పటికే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నడి ఎండాకాలంలో పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు. రేపటి (ఏప్రిల్ 12) నుంచి ఎండలు ఇంకా మండిపోతాయని వాతావారణ శాఖ తెలిపింది. దాంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రత 40డిగ్రీలు దాటింది.
Also Read..Andhra Pradesh : ఎండవేడికి పగిలిన కొండరాయి .. మీదపడుతుందోనని ఊరొదిలిపోతున్న జనాలు
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించచడం తెలిసిందే. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయిలో నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది.
ఇక, ఏపీలోనూ అదే పరిస్థితి. అక్కడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. 40డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.
సాధారణ ఉష్ణోగ్రతలకంటే సగటున 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయనగరం జిల్లా అల్లాడిపాలెంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Also Read..Hot Summer : ఏపీలో మండుతున్న ఎండలు, ఆ జిల్లాలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఎండ, ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఎండ ప్రభావంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వారం రోజుల పాటు ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని విప్తతుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అడ్డతీగల, నెల్లిపాక, చిత్తూరు, గంగవరం, రాజవమ్మంగి, బలరామచంద్రపురం, నర్సీపట్నం తదితర మండలాల్లో వడగాల్పులు వీస్తాయంది.