Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల్లో L1, L2, L3 ఏంటని తికమకపడుతున్నారా? పూర్తి వివరాలు ఇవిగో..

ఇక ఎల్‌2 అంటే సొంత స్థలం లేని వారి లిస్టు. వీరికి ఖాళీ స్థలం లేదు.. అలాగే, ఇల్లు కూడా ఉండదు.

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తూ ఇళ్ల అర్హుల లిస్టును తయారు చేశారు.

లబ్ధిదారులు సర్కారు నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. ఈ వివరాలను అధికారులు స్పష్టం చెబుతున్నారు. ఇప్పటికే సర్కారు దరఖాస్తులు స్వీకరించింది. జనవరిలో కూడా సర్వే నిర్వహించారు. దీని ఆధారంగా దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా తయారు చేశారు.

ప్రభుత్వం ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 పేరుతో దరఖాస్తులను విభజించడంతో వీటి గురించి కొందరు తికమకపడుతున్నారు. ఇందులో ఎల్‌ 1 అంటూ ఖాళీ స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేని వారి జాబితా. ఖాళీ ప్లేస్‌తో పాటు దరఖాస్తు దారులు గుడిసె లేదా మట్టి మిద్దెలు/రేకుల ఇల్లు ఉన్నప్పటికీ వారు ఈ జాబితాలోకే వస్తారు.

Also Read: మస్క్‌కు 13 మంది పిల్లలు ఉన్నారు కదా? వారి పోషణ కోసం ఎంతెంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసా? ఇంతేనా..

ఇక ఎల్‌2 అంటే సొంత స్థలం లేని వారి లిస్టు. వీరికి ఖాళీ స్థలం లేదు.. అలాగే, ఇల్లు కూడా ఉండదు. ఇటువంటి వారిని ఎల్‌ 2లో చేర్చారు అధికారులు. ఇక చివరిది ఎల్ 3 అంటే.. దరఖాస్తుదారులకు సొంత ఇల్లు ఉంటుంది. అయినప్పటికీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరి లిస్టు ఎల్‌ 3లో ఉంటుంది.

అలాగే, ఈ జాబితాలను చెక్ చేసుకోవడానికి సర్కారు వెబ్‌సైట్‌ కూడా లాంచ్‌ చేసింది. సర్కారు ఆఫీసుల చుట్టూ తిరగకుండా దరఖాస్తుదారులు మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. https://indirammaindlu.telangana.gov.in/applicantSearch ఈ యూఆర్‌ఎల్‌ టైప్‌ చేసి మీ ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నంబరు ఎంటర్‌ చేసి మీ దరఖాస్తు ఏ లిస్టులో ఉందో చూసుకోవచ్చు.

కాగా, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో భాగంగా కాంగ్రెస్‌ సర్కారు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని అంటోంది. వీటిపై తెలంగాణలోని పేదలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.