Elon Musk: మస్క్‌కు 13 మంది పిల్లలు ఉన్నారు కదా? వారి పోషణ కోసం ఎంతెంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసా? ఇంతేనా..

తల్లిదండ్రులు ఎంత డబ్బు సంపాదించినా ఈ మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు.

Elon Musk: మస్క్‌కు 13 మంది పిల్లలు ఉన్నారు కదా? వారి పోషణ కోసం ఎంతెంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసా? ఇంతేనా..

Updated On : February 17, 2025 / 8:51 PM IST

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌కు మొన్నటివరకు 12 మంది పిల్లలున్నారని అందరూ అనుకున్నారు. అయితే, రచయిత్రి ఆష్లీ సెయింట్‌ క్లెయిర్ తాజాగా ఆయనకు 13వ బిడ్డ ఉన్నారని తెలిపారు. తన బిడ్డకు తండ్రి మస్క్‌ అని చెప్పి షాక్ ఇచ్చారు.

తాను అయిదు నెలల క్రితం ఓ బిడ్డను కన్నానని, అతడి తండ్రి ఎలాన్‌ మస్క్ అని చెప్పారు. తమ బిడ్డ ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని తాను ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పలేదని అన్నారు. అయితే, పలు సామాజిక మాధ్యమ సంస్థలు దీన్ని బయటపెట్టాలని ప్రయత్నాలు చేశాయని తెలిపారు.

తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. ఆమె చెప్పిన విషయంపై మస్క్ స్పందించలేదు. కాగా, మస్క్‌ తొలి భార్య జస్టిన్‌ ఐవీఎఫ్ పద్ధతిలో అయిదుగురు పిల్లలను కన్నారు. అనంతరం 2008లో మస్క్, జస్టిన్ బ్రేకప్ అయ్యారు.

Also Read: పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ రియాక్షన్.. నారా లోకేశ్‌తో భేటీ..

అనంతరం మస్క్ నటి తాలులాహ్‌ రిలేను పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. మస్క్‌ కెనడియన్ సింగ్‌ గ్రిమ్స్‌తోనూ పిల్లల్ని కన్నారు. ఆ జంటకు మొత్తం ముగ్గురు పిల్లలు. అలాగే, మరో మహిళతో సంబంధం పెట్టుకుని మస్క్ మరో ముగ్గురు పిల్లలకు తండ్రయ్యారు.

తన పిల్లలకు మస్క్ ఆర్థికంగా ఎంతవరకు సహకారం అందిస్తున్నారన్న దానిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. మస్క్ తన బిడ్డలకు ఎంత డబ్బు ఇస్తుంటారు అంటూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. మస్క్‌కి గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు ఉన్నారని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా? మస్క్‌కి, గ్రిమ్స్‌కి మధ్య గతంలో న్యాయ పోరాటం జరిగింది.

టెక్సాస్‌లో ఎవరికైనా ముగ్గురు పిల్లలు ఉంటే వారి పోషణ కోసం చట్ట ప్రకారం నెలకు గరిష్ఠంగా 2,760 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఎంత డబ్బు సంపాదించినా ఈ మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో పిల్లల విషయంలో చేసుకున్న ఆర్థిక ఒప్పందాలను ఈ నిబంధన ప్రభావితం చేస్తుంది.