మీ వాహనంపై తప్పుగా వచ్చిన ట్రాఫిక్ ఈ-చలాన్‌పై ఎలా ఫిర్యాదు చేయాలి? ఇలా సింపుల్‌గా చేసేయండి..

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను పోలీసులు కెమెరాల ద్వారా గుర్తించి, ఫొటోలు తీసి ఈ-చలాన్ పంపిస్తున్నారు. కానీ కొన్ని సార్లు పొరపాటుగా కూడా ఈ-చలాన్ వచ్చే అవకాశం ఉంటుంది.

నిత్యం రహదారులపై వాహనాల్లో తిరుగుతుంటాం. ఆ సమయంలో చాలా మంది ఉద్దేశపూర్వంగానే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడతారు. అటువంటి వారికి ట్రాఫిక్ చలాన్లు వస్తే ఫర్లేదు కానీ, ఏ తప్పూ చేయకపోయినా జరిమానా కట్టాలని మీకు మెసేజ్ వస్తే ఎలా?

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను పోలీసులు కెమెరాల ద్వారా గుర్తించి, ఫొటోలు తీసి ఈ-చలాన్ పంపిస్తున్నారు. కానీ కొన్ని సార్లు పొరపాటుగా కూడా ఈ-చలాన్ వచ్చే అవకాశం ఉంటుంది.

చలానాలు తప్పుగా ఎందుకు వస్తాయి?
వాహన నంబర్‌ తప్పుగా నమోదైతే ఇతర వాహనదారుడు చేసిన తప్పునకు మీకు చలాను వస్తుంది. కెమెరా లేదా సాంకేతిక లోపం ద్వారానూ రావచ్చు.

ఈ-చలాన్ అనేది ఆన్‌లైన్ ట్రాఫిక్ ఫైన్. ఇది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పంపుతారు. రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం, అతి వేగంగా నడిపించడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం లాంటివాటిని గుర్తించి ఫొటో తీసి చలాన్ పంపుతారు. చలాన్ వచ్చిన 60 రోజులలోపు చెల్లించాలి లేదా ఫిర్యాదు చేయాలి.

Also Read: తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఉరుములు, మెరుపులతో వర్షాలు

తప్పుడు చలాన్ వచ్చినప్పుడు ఇలా చేయండి

  • ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే విధానం
  • https://echallan.parivahan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  • ‘Complaint’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • వివరాలు నమోదు చేయండి
  • పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్
  • చలాన్ నంబర్
  • వాహన సంఖ్య లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్
  • చలాన్ వచ్చిన రాష్ట్రం, మీ సమస్యకు సంబంధించిన వివరాలు తెలపండి
  • 500 అక్షరాల్లో సమస్యను వివరించండి.
  • ఉదా: “ఆ సమయంలో నా వాహనం ఇంటి వద్ద పార్క్ చేసి ఉంది. చలాను పడిన ప్రదేశంలో నేను లేను”
  • ఆధారాలు ఉంటే అప్లోడ్ చేయండి
  • ఉదా: సీసీటీవీ ఫొటో
  • జీపీఎస్ ట్రాకర్ నుంచి లొకేషన్
  • వాహనం ఇంటి దగ్గర ఉన్న ఫొటోలు
  • కాప్చా టైప్ చేయండి
  • ‘సబ్మిట్’ క్లిక్ చేయండి
  • ఫిర్యాదును ట్రాక్ చేయడానికి టికెట్ నంబర్ వస్తుంది

ఈ-మెయిల్‌ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు
helpdesk-echallan@gov.in
స్పష్టంగా సమస్యను రాసి, ఆధారాలతో పంపించండి

ఫోన్ కాల్ ద్వారా
+91-120-4925505 (ఉదయం 6 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు)

ఐవీఆర్‌ఎస్ (IVRS)
4 నంబర్ నొక్కి ఈ-చలాన్ సమస్యను చెప్పవచ్చు

ఫిర్యాదు స్టేటస్‌ ఇలా తెలుసుకోండి

వెబ్‌సైట్: https://echallan.parivahan.gov.in/gsticket/

  • ‘Ticket Status’ పై క్లిక్ చేయండి
  • టికెట్ నంబర్ ఇవ్వండి
  • ‘Check Status’ క్లిక్ చేయండి