Weather Updates: తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఉరుములు, మెరుపులతో వర్షాలు
హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం పడింది. కొన్ని రోజుల విరామం తర్వాత కురిసిన వర్షం ఇది.

Heavy rains
తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు – నాలుగు రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగింది. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
ఈ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అన్నారు.
కాగా, హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం పడింది. కొన్ని రోజుల విరామం తర్వాత కురిసిన వర్షం ఇది. సోమవారం మధ్యాహ్నం వరకు ఉక్కబోతను అనుభవించిన హైదరాబాద్ ప్రజలు ఆ తర్వాత రిలాక్స్ అయ్యారు. అయితే, పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.