అమ్మాయిల కోసం 6 బెస్ట్ టూ వీలర్స్ ఇవే.. లైట్‌వెయిట్, స్టైలిష్.. హీరోయిన్‌లా ఫీలైపోవచ్చు..
మోడర్న్ లుక్, డ్యూయల్-టోన్ కలర్స్‌తో అమ్మాయిలను ఈ టూ వీలర్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. సిటీలోనూ ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటాయి.

కాలేజీ, ఆఫీస్ లేదా రోజువారీ పనుల కోసం మహిళలు టూవీలర్‌లను బాగా వాడేస్తున్నారు. మీరు తేలికగా, స్టైలిష్‌గా నడపగలిగే స్కూటర్ కోసం చూస్తున్నారా? తక్కువ బరువు, అద్భుతమైన మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ 6 స్కూటర్ల జాబితా మీకోసం.
యమహా ఫాస్సినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (Yamaha Fascino 125 FI Hybrid)
ఈ జాబితాలో అత్యంత తేలికైన స్కూటర్ ఇది. కేవలం 98 కిలోల బరువుతో ట్రాఫిక్‌లో కూడా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. రెట్రో డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్ దీని ప్రత్యేకతలు.
-
- ప్రారంభ ధర: రూ.81,180
- బరువు: 98 కిలోలు
- ఇంజిన్: 125cc FI హైబ్రిడ్
- పవర్, టార్క్: 8 bhp, 10.3 Nm
- ప్రత్యేకత: అల్ట్రా-లైట్ వెయిట్, మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ
హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ (Hero Pleasure+ XTEC)
మోడర్న్ లుక్, డ్యూయల్-టోన్ కలర్స్‌తో అమ్మాయిలను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. 102 కిలోల బరువుతో ఉండే ఈ టూ వీలర్ సిటీలో ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుంది.
- ప్రారంభ ధర: రూ.75,263
- బరువు: 102 కిలోలు
- ఇంజిన్: 110cc
- పవర్, టార్క్: 8 bhp, 8.70 Nm
- మైలేజ్: సుమారు 55 కిలోమీటర్లు
- ప్రత్యేకత: స్టైలిష్ డిజైన్, క్రోమ్ ఎలిమెంట్స్
టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 (TVS Scooty Zest 110)
తేలికైన స్కూటర్లలో స్కూటీ జెస్ట్‌కు మంచి పేరుంది. కేవలం 103 కిలోల బరువుతో ఉండే దీనిని హ్యాండిల్ చేయడం చాలా సులువు.
- ప్రారంభ ధర: రూ.76,591
- బరువు: 103 కిలోలు
- ఇంజిన్: 109.7cc
- పవర్ & టార్క్: 7.7 bhp, 8.8 Nm
- ప్రత్యేకత: తేలికైన హ్యాండ్లింగ్, కాంపాక్ట్ డిజైన్
హోండా డియో 110 (Honda Dio 110)
యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్కూటర్ హోండా డియో. స్పోర్టీ లుక్, నమ్మకమైన ఇంజిన్‌తో ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.
- ప్రారంభ ధర: రూ.75,026
- బరువు: 106 కిలోలు
- ఇంజిన్: 109.51cc
- పవర్ & టార్క్: 7.84 bhp, 9.03 Nm
- ప్రత్యేకత: స్పోర్టీ, షార్ప్ డిజైన్, యూత్ ఫేవరెట్
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
నమ్మకానికి, స్మూత్ రైడింగ్‌కు టీవీఎస్ జూపిటర్ పెట్టింది పేరు. ఇది పురుషులతో పాటు మహిళలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
- ప్రారంభ ధర: రూ.78,631
- బరువు: 106 కిలోలు
- ఇంజిన్: 113.3cc
- పవర్ & టార్క్: 7.9 bhp, 9.8 Nm
- ప్రత్యేకత: నమ్మకమైన ఇంజిన్, SmartXonnect ఫీచర్స్
సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)
125cc సెగ్మెంట్‌లో స్టైల్, కంఫర్ట్, పవర్‌కు సరైన ఆప్షన్ యాక్సెస్ 125.
- ప్రారంభ ధర: రూ.83,800
- బరువు: 106 కిలోలు
- ఇంజిన్: 124cc
- పవర్ & టార్క్: 8.31 bhp, 10.2 Nm
- ప్రత్యేకత: ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్