Hyderabad Crime : నగరంలో నయామోసం.. నకిలీ డీఎస్పీని అడ్డుపెట్టి రూ.1.2 కోట్లు దోచేశారు

ఆర్థిక మోసాలు రాను రాను పెరిగిపోతున్నాయి. నమ్మి డబ్బిస్తే నట్టేట ముంచుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇటువంటి ఘటన నగరంలో జరిగింది.

Hyderabad Crime : ఆర్థిక మోసాలు రాను రాను పెరిగిపోతున్నాయి. నమ్మి డబ్బిస్తే నట్టేట ముంచుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇటువంటి ఘటన నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మెహిదిపట్నంకు చెందిన సునీల్ కుమార్ డిసెంబర్ 2018లో జయప్రతాప్ కొండేటిని కలిశారు. ఈ సమయంలో తన వద్ద మంచి బిసినెస్ ప్లాన్ ఉందని..1.2 కోట్లు ఇస్తే వారంలో రూ.3 కోట్లు ఇస్తానంటూ చెప్పాడు. అయితే సునీల్ అతడి మాటలు నమ్మలేదు.. తన వద్ద అంతమొత్తం లేదని చెప్పి తప్పించుకున్నాడు.

చదవండి : Hyderabad Crime : సెలైన్ బాటిల్‌లో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ యువ వైద్యుడు

2019లో మరోసారి సునీల్ కుమార్ వద్దకు వెళ్ళాడు జయప్రతాప్.. వెళ్తూ వెళ్తూ తనతోపాటు మునిరామయ్య అనే వ్యక్తిని తన వెంట తీసుకెళ్లాడు. మునిరామయ్యను తిరుపతి సీఐడీ డీఎస్పీగా పరిచయం చేశాడు. నీ పెట్టుబడికి మునిరామయ్య గ్యారెంటీ అని సునీల్‌ని ఒప్పించాడు జయప్రకాశ్.. అంతేకాదు అతడికి ఆర్‌కే క్లీన్‌ రూమ్స్‌ సొల్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రూ.3 కోట్ల చెక్ సునీల్‌కి ఇచ్చాడు.

చదవండి : Hyderabad Crime : భార్యపై అనుమానం..! చంపేసి ఇంటికి తాళం వేసి.. ఆ తర్వాత

దీంతో అతడికి నమ్మకం కలిగి 2019 నవంబర్ నెలలో 1.2 కోట్లు ఇచ్చేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత వారం గడిచినా ఇవ్వలేదు.. ఆలా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో సునీల్ కి అనుమానం వచ్చి మునిరామయ్య గురించి ఆరా తీశారు. ఏపీలో ఆ పేరుతో సీఐడీలో ఎవరు తెలియడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేశారని సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు