Prajavani Programm : కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు.. ప్రజాభవన్‌కు పోటెత్తిన దరఖాస్తుదారులు..

చాలా రోజుల తర్వాత ఎప్పుడూ లేని విధంగా ప్రజాభవన్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి.

Prajavani Programm : హైదరాబాద్ లో ప్రజాభవన్ కు దరఖాస్తుదారులు పోటెత్తారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన లబ్దిదారులకు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ప్రజావాణి కోసం ఇవాళ దరఖాస్తుదారులు ఎక్కువగా వచ్చారు.

దరఖాస్తుదారులతో కిక్కిరిసిన ప్రజాభవన్ పరిసరాలు..
బేగంపేట ప్రజాభవన్ లోని ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్యంగా లబ్దిదారులు తరలివచ్చారు. దరఖాస్తుదారులతో ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం తీసుకొచ్చింది. ప్రజల సమస్యలకు సంబంధించి శాఖాపరంగా పరిష్కరించేందుకు ఈ ప్రజావాణి నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టి ఏడాది అవుతోంది.

Also Read : వరుసగా సినీ ప్రముఖులపై ఐటీ దాడులు.. దిల్ రాజు భార్య ఏమన్నారంటే..

కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు..
తాజాగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇవాళ్టి ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. దరఖాస్తుదారులతో ప్రజాభవన్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణిలో తమ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు.

రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం..
మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి లబ్దిదారులు, దరఖాస్తులు పోటెత్తారు. గడిచిన పదేళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు. ఇక, రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకు కూడా ఆప్షన్ లేకపోయింది. అయితే, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది.

దాంతో దరఖాస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇవాళ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దరఖాస్తుదారుల్లో మేజర్ గా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన వారే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఎప్పుడూ లేని విధంగా మరోసారి ప్రజాభవన్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి.

 

Also Read : ఈటల రాజేందర్ ఉగ్రరూపం.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగలగొట్టిన బీజేపీ ఎంపీ, కారణం ఏంటంటే..