HUT Terrorist Arrest : హైదరాబాద్, భోపాల్ మాడ్యూల్ కేసులో హెచ్ యూటీ ఉగ్రవాది సల్మాన్ అరెస్టు
సల్మాన్ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్ తో పాటు పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, భోపాల్ లో ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసిన కేసులో ఇప్పటికే 17 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.

NIA investigation
NIA Arrest HUT terrorist Salman : హైదరాబాద్, భోపాల్ మాడ్యూల్ కేసులో (Hyderabad And Bhopal Module Case) ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. హెచ్ యూటీ ఉగ్రవాది సల్మాన్ ను అరెస్టు చేసింది. హైదరాబాద్, భోపాల్ మాడ్యూల్ కేసులో మే24న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో (Hyderabad Rajendranagar) హెచ్ యూటీకి చెందిన ఉగ్రవాది సల్మాన్ ను అరెస్టు చేసింది. రాజేంద్రనగర్ లోని సల్మాన్ కు చెందిన రెండు ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది.
సల్మాన్ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్ తో పాటు పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, భోపాల్ లో ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసిన కేసులో ఇప్పటికే 17 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. హిజ్బ్ ఉత్-తహ్రీర్ కేసులో పరారీలో ఉన్న సల్మాన్ ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ లో సల్మాన్ తలదాచుకున్నట్లు పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు సల్మాన్ ను అరెస్టు చేశారు.
దేశంలో షరియా చట్టాన్ని అమలు చేసేందుకు హిజ్బ్ ఉత్-తహ్రీర్ కుట్ర పన్నింది. హైదరాబాద్, భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్-తహ్రీర్ పని చేస్తోంది. ఓ వర్గం యూత్ ను ఆకర్షించి దేశవ్యాప్తంగా విస్తరించేలా హిజ్బ్ ఉత్-తహ్రీర్ కుట్ర పన్నింది. అయితే హైదరాబాద్ లో సల్మాన్ నేతృత్వంలో హిజ్బ్ ఉత్-తహ్రీర్ కార్యకలాపాలు చేస్తోంది.
ఇందులో సల్మాన్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మే24న హైదరాబాద్ లో సలీమ్ తోపాటు మరో ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేయగా సల్మాన్ పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సల్మాన్ ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.