Hyderabad : పోలీస్ బూత్‌ను బార్‌గా మార్చిన యువకులు.. మండిపడుతున్న ప్రజలు

హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ ఎదురుగా ట్రాఫిక్ బూత్ ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కోసం ఏర్పాటు చేసిన ఆ బూత్ ఇద్దరు యువకులకు బార్ లాగ మారింది. హాయిగా కూర్చుని ఫుల్‌గా మందు తాగి, బిర్యాని తిన్నారు. బహిరంగంగా ఇద్దరు వ్యక్తులు ఇలా మద్యం సేవించడంపై జనం మండిపడుతున్నారు.

Hyderabad : పోలీస్ బూత్‌ను బార్‌గా మార్చిన యువకులు.. మండిపడుతున్న ప్రజలు

Hyderabad

Updated On : July 25, 2023 / 2:50 PM IST

Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మందుబాబులు వీటిని లెక్క చేయట్లేదు. పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూత్‌ని కూడా వదిలిపెట్టకుండా బార్‌గా మార్చేశారు.  మద్యం తాగుతూ, బిర్యానీ తింటూ ఎంజాయ్ చేశారు.

Hyderabad : హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన వర్షం.. చెరువుల్లా మారిన రోడ్లు, భారీగా ట్రాఫిక్ జామ్.. అత్యధికంగా చార్మినార్‌లో

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు జనాలు ట్రాఫిక్‌లలో చిక్కుకుని గమ్యస్ధానాలకు చేరడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మందుబాబులు మాత్రం ఏ చీకు చింతా లేకుండా మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. హైటెక్ సిటీ జంక్షన్ అంటే నిత్యం విపరీతమైన రద్దీగా ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ బూత్‌లో ఇద్దరు యువకులు దర్జాగా మద్యం తాగుతున్న వీడియో వైరల్ అయ్యింది. మందు తాగుతూ, బిర్యానీ తింటూ ఆ యువకులు ఎంజాయ్ చేశారు.

Hyderabad : భాగ్యనగరంలో చుక్కలు చూపిస్తున్న క్యాబ్ ధరలు.. వర్షాల్ని క్యాష్ చేసుకుంటున్న యజమానులు

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. పోలీసులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ వీడియో చూసి పోలీసులు ఏం స్పందిస్తారో చూడాలి.