Hyderabad : హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన వర్షం.. చెరువుల్లా మారిన రోడ్లు, భారీగా ట్రాఫిక్ జామ్.. అత్యధికంగా చార్మినార్‌లో

భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. Hyderabad Rain

Hyderabad : హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన వర్షం.. చెరువుల్లా మారిన రోడ్లు, భారీగా ట్రాఫిక్ జామ్.. అత్యధికంగా చార్మినార్‌లో

Hyderabad Rain

Updated On : July 24, 2023 / 11:00 PM IST

Hyderabad Rain : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. నగరంలోని కుత్బుల్లాపూర్, తిరుమలగిరి, అల్వాల్, బోయిన్ పల్లి, జవహర్ నగర్, బేగంపేట్, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, హబ్సిగూడ ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై వర్షపు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ముందుకు పోలేక, వెనక్కి రాలేక వాహనదారుల నరకం చూస్తున్నారు.

భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. అలాగే అనవసర ప్రయాణాలు చేయొద్దని డీఆర్ఎఫ్ బృందాలు సూచించాయి. మరోవైపు సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

Also Read..Telangana Rains : తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

చార్మినార్ లో అత్యధికంగా 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగోజీగూడలో 4.4 సెంటీమీటర్లు, మలక్ పేట్ లో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, సనత్ నగర్ లో 4.1 సెంటీమీటర్, అంబర్ పేట్, లంగర్ హౌస్, సికింద్రాబాద్ లో 3.9 సెంటీమీటర్లు, బంజారాహిల్స్, గోషామహల్, హిమాయత్ నగర్ లో 3.5 సెంటీమీటర్లు, ఫిలింనగర్, సరూర్ నగర్ లో 3.3 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది. ఓవైపు భారీ వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మాదాపూర్ ఐకియా సర్కిల్ లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ ను నియంత్రించేందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగారు.