Telangana Rains : తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు...Telangana Rain Alert

Telangana Rains : తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana Rain Alert

Telangana Rain Alert : తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇది చాలదన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వర్ష సూచన చేసింది. తెలంగాణలో రేపటి నుంచి వానలు మళ్లీ దంచికొట్టనున్నాయి. నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Also Read..Gandhari Vaana : గాంధారి వాన అంటే ఏంటి.. మహాభారతంలో గాంధారికి, గాంధారి వానకు సంబంధమేంటి..?

నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేటకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 25, 26, 27 తేదీలలో అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.

ఈరోజు..
* ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి భారీ వర్షాలు.
* మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు.

రేపు..
* మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి నుండి అత్యంత భారీ వర్షాలు.
* ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు.
* జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు భారీ వర్ష సూచన.