Gandhari Vaana : గాంధారి వాన అంటే ఏంటి.. మహాభారతంలో గాంధారికి, గాంధారి వానకు సంబంధమేంటి..?

గాంధారీ వాన అనేది చాలా అరుదుగా వినిపించేమాట. గాంధారీ అంటే మహాభారతంలో ప్రముఖంగా వినిపించే పేరు గాంధారీ మాతకు గాంధారి వానకు సంబంధం ఉందా..? గాంధారి వాన వెనుక గాంధారి అనే మాట ఎందుకొచ్చింది..?

Gandhari Vaana : గాంధారి వాన అంటే ఏంటి.. మహాభారతంలో గాంధారికి, గాంధారి వానకు సంబంధమేంటి..?

Gandhari Vaana..Gandhari mata

Gandhari Vaana..Gandhari mata : వానల్లో ఎన్నో రకాలున్నాయి. తొలకరి వాన, జడివాన, జోరువాన, బట్టదడుపు వాన ఇలా చాలారకాల పేర్తున్నాయి. వాటిలో ‘గాంధారి వాన’. కూడా ఒకటి. గాంధారి వాన అనేది చాలా అరుదుగా వినిపించేమాట. చాలామందికి ఈ పదమే తెలియదంటే నమ్మేతీరాలి. గాంధారి అంటే మహాభారతంలో ప్రముఖంగా వినిపించే పేరు. ‘గాంధారి’ ధృతరాష్టుడి భార్య. పుట్టుగుడ్డి ధృతరాష్ట్రుని భార్య. గాంధార దేశ రాజకుమారి. మహాభారతంలో మరో ప్రముఖుడు దుర్యోధనుడు తల్లి అని చాలామందికి తెలిసిందే. కానీ గాంధారి దేవికి.. గాంధారి వానకు సంబంధం ఉందా? ఉంటే అది ఎటువంటి సంబంధం..? వాన అనేది ప్రకృతికి సంబంధించినది. గాంధారి దేవి మహాభారతంలో ప్రముఖ స్త్రీ. వానకు గాంధారి వాన అనే పేరు ఎలా వచ్చింది..? దీనికి గాంధారి మాతకు ఉన్న సంబంధమేంటి.. అంటే సంబంధం ఉందనే చెబుతారు సాహిత్య విశ్లేషకులు.

గాంధారి వాన గురించి చెప్పాలంటే ముందు గాంధారి గురించి తెలియాలి. గాంధారి మహాభారతంలో హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుని భార్య. ఆమె గాంధార దేశ రాజకుమారి. కౌరవుల్లో జేష్ణుడు దుర్యోధనుని తల్లి. 101 మంది సంతానికి తల్లి. 100మంది కౌరవులతో పాటు ఓకైక పుత్రిక దుస్సలతో కలిపి మొత్తం 101 మందికి తల్లి. తన భర్త ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఆయన చూడని ఈ లోకాన్ని నేను కూడా చూడనని కళ్లకు గంతలు కట్టుకున్న మహా పతివ్రతగా గాంధారి దేవి కీర్తించబడింది. అంటువంటి గాంధారి దేవి పేరు ఓ రకంగా కురిసే వానకు ఎందుకు వచ్చింది..? అంటే ఆసక్తికర విశ్లేషణ ఒకటి ఉంది.

గాంధారి వాన అంటే కంటికి పక్కనున్న వస్తువు కూడా కనిపించనంతగా.. ఒక తెరలాగా జోరుగా కురిసే వానను గాంధారి వాన అంటారు. కురిస్తే.. అది నిరుపయోగంగా ఉంటే అప్పుడు అలాంటి వానను గాంధారి వాన అంటారు. అలాగే అవసరం లేనప్పుడు కురిసే పెద్దవానను.. ఎంత వర్షం కురిసినా ఉపయోగంలేకుండా పోయే వాననుకూడా గాంధారి వాన అంటారు. అలా గాంధారికి, గాంధారి వానకు అవినావభావ విశ్లేషణ ఉంది.

Names of Rains : వానల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా..? వాటి పేర్లు, అర్థాల్లో ఆసక్తికర విషయాలు..

అంత వాన కురిసినా ఉపయోగం లేకుండా పోయిన వానను గాంధారి వాన అంటారు. అలాగే అవసరం లేనప్పుడు, అదను లేనప్పుడు (ముఖ్యంగా వ్యవసాయానికి అవసరం లేనప్పుడు) కురిసే పెద్దవానను గాంధారి వాన అంటారు. అంటే మరోమాటలో చెప్పాలంటే అడవిగాచిన వెన్నెల లాంటిది అని కూడా అనుకోవచ్చు.

మరి కన్ను కనిపించనంతగా కురిసే వానని ధృతరాష్ట్ర వాన అనవచ్చు కదా… గాంధారి వాన అని మాత్రమే ఎందుకు అంటున్నారు అనే అనుమానం కచ్చితంగా వచ్చి తీరుతుంది. ధృతరాష్ట్రుడికి పుట్టుకతో కళ్లు లేవు. కానీ గాంధారి తన భర్తకు కళ్ళు లేవని తెలిసిన మరుక్షణం నుంచే తాను కడా కళ్ళకు గంతలు కట్టుకుంది. తనకు పుట్టిన బిడ్డల్ని కూడా చేతితో తడిమి చూసుకునేది తప్ప కంటితో చూడనేలేదు.

Also Read: శృంగార స‌న్నివేశంలో భగవద్గీత.. మండిప‌డుతున్న భార‌తీయులు.. తొల‌గించ‌క‌పోతే ఊరుకోం

గాంధారి మహారాణికి ఎంతమంది పరిచారికలు ఉన్నా తన బిడ్డల బాగోగులు స్వయంగా చూసుకునేది. వారికి స్వయంగా అన్నం తినిపించేది. వారిపై అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపించేది. వారి బాగోగులు పట్టించుకోకుండా అంటూ మంచీ చెడులు చెప్పకుండా కేవలం కేవలం వారిపై అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపింది. అంటే గుడ్డి ప్రేమ అన్నట్లుగా.. ఏతల్లికైనా బిడ్డలపై ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ మంచి చెడులు చెప్పేలా.. తెలియజేసేలా ఉండాలి. కానీ గాంధారి తన బిడ్డలను అలా పెంచలేదని అందుకే వారు రాజ్య కాంక్షతో కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యారని.. దాంతో ఎంతో నష్టం జరిగిందని అంటారు. గాంధారీ తన బిడ్డల్ని పెంపకం వలెనే గాంధారి వాన కూడా మన పంట అదునుతో సంబంధం లేకుండా కురియడం వల్ల.. పంటలు నష్టపోతాయని గాంధారి పిల్లల్లాగే పంటలు కూడా చెడిపోతాయని అర్థమట. అందువల్ల అలాంటి నిరుపయోగమైన వర్షాన్ని కూడా గాంధారి వాన అంటారు. గాంధారీ వాన అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వినిపిస్తుంది.

Also Read: జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? వెరీ ఇంట్రస్టింగ్..!

కాగా, నాచ్యురల్ స్టార్ నానీ నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు దుమ్ము చూడు మామ.. దున్నపోతుల బెరెయ్ చూడు అనే పాటలో.. కురసా కురసా అడివిలోనా పీలగా కురిసెనే గాంధారి వాన.. కురసా కురసా అడివిలోనా పీలగా కురిసెనే గాంధారి వాన అనే మాట తెలుగు సాహిత్యంలో మరో వినిపించింది. అప్పట్లో గాంధారి వాన ఏంటి.. అనే విషయంపై చర్చ కూడా వచ్చింది.