ATM : రూ. 500 డ్రా చేస్తే ..రూ.2,500లు వస్తున్నాయని ఏటీఎంకు ఎగబడిన జనాలు

ఏటీఎంలో డబ్బులు మనం ఎంత డ్రా చేసుకుంటే అంతే వస్తాయి. కానీ ఓ ఏటీఎంలో మాత్రం ఏకంగా డ్రాచేసిన దానికి కంటే నాలుగు రెట్లు డబ్బులు వచ్చాయంట..ఓ వ్యక్తి రూ.500లు డ్రా చేస్తే ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువగా రూ.2,500లు వచ్చాయంట..ఈ విషయం ఆనోటా ఈనోటా జనాలకు తెలిసింది. అంతే ఒక్కసారిగా ఆ ఏటీఎంకు ఎగబడ్డారు.

ATM : రూ. 500 డ్రా చేస్తే ..రూ.2,500లు వస్తున్నాయని ఏటీఎంకు ఎగబడిన జనాలు

Man Draws Rs 500 From ATM But Came Rs 2500 From Machine

ATM : ఏటీఎంలో డబ్బులు మనం ఎంత డ్రా చేసుకుంటే అంతే వస్తాయి. కానీ హైదరాబాద్ నగరంలోని ఓ ఏటీఎంలో మాత్రం ఏకంగా డ్రాచేసిన దానికి కంటే నాలుగు రెట్లు డబ్బులు వచ్చాయంట..ఓ వ్యక్తి రూ.500లు డ్రా చేస్తే ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువగా రూ.2,500లు వచ్చాయంట..ఈ విషయం ఆనోటా ఈనోటా జనాలకు తెలిసింది. అంతే ఒక్కసారిగా ఆ ఏటీఎంకు ఎగబడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ ఓ వ్యక్తి రూ.500లు డ్రా చేస్తే ఏకంగా రూ.2,500లు వచ్చాయంట పైగా రసీదు కూడా రూ.500లకే వచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మరోసారి రూ.500లు డ్రా చేయగా మళ్లీ రూ.2,500లు వచ్చాయి. ఈ విషయం కాస్తా జనాలకు తెలియటంతో ఆ ఏటీఎంకు జనాలు ఎగబడ్డారు.

శాలిబండకు చెందిన ఓ వ్యక్తి హరిబౌలి చౌరస్తాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంకు వెళ్లి రూ. 500 డ్రా చేయగా రూ. 500కు బదులుగా ఏటీఎం నుంచి రూ. 2,500 వచ్చాయి. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే విషయం తెలుసుకున్న స్థానికులు ఏటీఎం వద్దకు చేరుకుని, డబ్బులు డ్రా చేసేందుకు పోటీ పడ్డారు. ఈక్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని జనాలను కంట్రోల్ చేశారు. ఏటీఎంను మూసివేసి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.

కాగా 2022 జూన్ లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఏటీఎం నుంచి రూ.500 డ్రా చేయగా రూ.2,500లు వచ్చాయి. దీంతో అతను ఆశ్చర్యపోయాడు. మరోసారి రూ.500లు డ్రాచేయగా మళ్లీ రూ.2,500లు వచ్చాయి. దీంతో ఈ విషయం కాస్తా జనాలకు తెలియటంతో ఆ ఏటీఎంకు జనాలు భారీగా వచ్చి డబ్బులు డ్రా చేయటానికి పోటీలు పడ్డారు. నాగ్‌పూర్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖపర్‌ఖేడా పట్టణంలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM)లో జరిగిందీ ఘటన.