Kumari Aunty: ఎవరీ కుమారి ఆంటీ? ఎందుకింత క్రేజ్‌? ఆమె మాటల్లోనే వినండి..

ఏకంగా సీఎం తన ఫుడ్ స్టాల్ పట్ల స్పందించడం ఆనందంగా ఉందని.. సీఎం వచ్చి తన స్ట్రీట్ ఫుడ్‌లో తింటానని అనడం గౌరవంగా భావిస్తున్నానని కుమారి ఆంటీ 10టీవీకి చెప్పారు.

Kumari Aunty: ఎవరీ కుమారి ఆంటీ? ఎందుకింత క్రేజ్‌? ఆమె మాటల్లోనే వినండి..

Kumari

హైదరాబాద్‌, హైటెక్ సిటీ ఐటీసీ కోహినూర్ ఎదురుగా స్ట్రీట్ ఫుడ్‌ అమ్ముతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు కుమారి ఆంటీ. దీంతో ఆమె స్ట్రీట్ ఫుడ్‌ సెంటర్ వద్దకు కస్టమర్లలు పోటెత్తుతుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

ఫుడ్‌స్టాల్‌ను 10 రోజుల పాటు మూసివేయాలని ట్రాఫిక్ అధికారులు నిబంధనలు విధించారు. కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ రోడ్ కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌ను తొలగించారు. నిన్న జరిగిన ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ స్పందించారు.

కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్‌ను యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనకు ప్రాధాన్యం ఇస్తుంది అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

ఏకంగా సీఎం తన ఫుడ్ స్టాల్ పట్ల స్పందించడం ఆనందంగా ఉందని.. సీఎం వచ్చి తన స్ట్రీట్ ఫుడ్‌లో తింటా అనడం గౌరవంగా భావిస్తున్నానని కుమారి ఆంటీ 10టీవీకి చెప్పారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తరువాత తిరిగి ఈ విషయం తెలుసుకోవడం తిరిగి తనలో హుషారు నింపిందని చెప్పారు.

స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఇంకా ఏమన్నారు?

కుమారి ఆంటీకి అండగా నిలబడ్డ సీఎం రేవంత్ రెడ్డి