×
Ad

మన హైదరాబాద్‌లో ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషన్.. త్వరలోనే..

తెలంగాణలో మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోయి కనపడుతున్నాయి.

Hyderabad: ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఆర్టీసీ అధికారులు స్థల సమీకరణ పనుల్లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్‌) దేశంలోని అతి పెద్ద బస్ స్టేషన్లలో ఒకటి.

ఆసియాలోనే అతిపెద్ద బస్ టెర్మినల్‌ (సుమారు 36 ఎకరాల విస్తీర్ణం) చెన్నైలోని కోయంబేడులో ఉంది. హైదరాబాద్‌లో నిర్మించే బస్ స్టేషన్ టెర్మినల్‌ మరింత పెద్దగా ఉంటుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు ఉద్యోగావకాశాలలూ పెరగనున్నాయి.

తెలంగాణలో మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోయి కనపడుతున్నాయి. ఉచిత టికెట్‌ ఇస్తుండడంతో మహిళలు బస్సు సౌకర్యాన్ని బాగా వాడుకుంటున్నారు. గతంలో బస్సుల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే వారు. ఇప్పుడు అది 40 శాతానికి పెరిగింది.

Also Read: Peanut Chikki: కీలక నిర్ణయం.. చిన్నారులకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ..

మహిళా ప్రయాణికుడు విపరీతంగా పెరిగిపోవడంతో పురుషులు బస్సులు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 721 సర్వీసులను పెంచారు. పురుషుల కోసం 270 మెట్రో డీలక్స్ బస్సులు ప్రారంభించారు. మహాలక్ష్మీ పథకం కింద వీటిల్లో మహిళలు ప్రయాణించలేరు.

మరోవైపు, తెలంగాణలో సుమారు 2,800 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇందుకుగానూ హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ బస్ డిపోల ఏర్పాటు చేయనున్నారు. శివారు ప్రాంతాల్లో నూతనంగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు సమాచారం.