Peanut Chikki: కీలక నిర్ణయం.. చిన్నారులకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ..

అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ ఇవ్వాలని సర్కారుకు శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు చేసింది.

Peanut Chikki: కీలక నిర్ణయం.. చిన్నారులకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ..

Peanut Chikki

Updated On : December 5, 2025 / 9:53 AM IST

Peanut Chikki: తెలంగాణలోని అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రభుత్వం మరింత పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. బెల్లంతో తయారు చేసే పల్లీ చిక్కీలను పిల్లలను ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

శిశు సంక్షేమశాఖ సమక్షంలో పోషకాహార నిపుణులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇటీవల ఓ సమావేశం జరిగింది. పిల్లల్లో పోషకాహార లోపాలను తగ్గించడంపై వారు చర్చలు జరిపారు. (Peanut Chikki )

Also Read: ఫ్యూచర్‌ సిటీలో వరల్డ్ ట్రేడ్‌ సెంటర్, ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోలు, ఇంకా ఎన్నో.. 8న సమిట్‌లో కీరవాణి 90 నిమిషాల కచేరి

పల్లీలు, బెల్లం, నువ్వులు, ఇతర పలు పదార్థాలు చిన్నారుల ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆ సమావేశంలో నిపుణులు చెప్పారు. అలాగే, 2047 నాటికి పిల్లల్లో పోషకాహార లోపాలను పూర్తిగా తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతాన్ని పెంచడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పల్లీ చిక్కీలను అందించాలని నిర్ణయించారు.

అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ ఇవ్వాలని సర్కారుకు శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు చేసింది. సర్కారు ఆమోదముద్ర వేశాక పిల్లలకు అవి అందుతాయి.