Droupadi Murmu: రేపు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి.. ఐదు రోజులపాటు నగరంలోనే బస

రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం ద్రౌపది ముర్ము నగరంలో సోమవారం నుంచి ఐదు రోజులపాటు బస చేస్తారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Droupadi Murmu: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు ద్రౌపది ముర్ము నగరంలోనే బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. నిలయంలోపల ఉన్న ఆరు భవనాలను, దీని బయట ఉన్న మరో 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఉద్యానవనాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతంలో రోడ్లను మెరుగుపర్చడంతోపాటు, మంచి నీటి వసతి కల్పించారు. పాములు వంటి హానికర జీవులు రాష్ట్రపతి నిలయం, ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక బృందం ఇక్కడికి వచ్చింది. రాష్ట్రపతి భద్రతసహా ఇతర ఏర్పాట్లను పరిశీలించింది. ప్రత్యేక బలగాలు ఈ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. బొల్లారం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో గట్టి భద్రత కొనసాగుతోంది.

PAN-Aadhaar: మార్చి 31లోపు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ రద్దు.. ఐటీ శాఖ చివరి హెచ్చరిక

రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అపశృతులు దొర్లకుండా చూసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే రాష్ట్రపతి భవన్ లోపలికి అనుమతిస్తారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గానికి సంబంధించి 40 కార్లతో కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. రాష్ట్రపతి వచ్చే విమానం ల్యాండయ్యే హకీంపేట విమానాశ్రయాన్ని కూడా అధికారులు తమ అధీనంలో ఉంచుకున్నారు. రాష్ట్రపతి నిలయం, కాన్వాయ్ మార్గం, ఎయిర్‌పోర్ట్ వంటి అన్ని ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు