Hydra commissioner: 200 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది: రంగనాథ్

ఆక్రమణలపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.

Hydra commissioner: 200 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది: రంగనాథ్

HYDRA Commissioner Ranganath

Updated On : December 28, 2024 / 4:32 PM IST

హైడ్రా గురించి ఆ సంస్థ కమిషనర్‌ రంగనాథ్ ఇవాళ మీడియాకు పలు వివరాలు తెలిపారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 2024 జులై 19న హైడ్రా ఏర్పాటైందని అన్నారు. 2,000 చదరపు కిలోమీటర్లు హైడ్రా పని చేస్తోందని తెలిపారు. దీనికి సీఎం చైర్మన్ గా ఉన్నారని తెలిపారు. 200 ఎకరాల భూమిని హైడ్రా కాపాడిందని చెప్పారు.

బఫర్ జోన్.. ఎఫ్‌టీఎల్‌ల గురించి పబ్లిక్ కి తెలిసేలా చేసినట్లు తెలిపారు. వివిధ సంస్థల నుంచి వివరాలు సేకరించి చెరువులు ప్రభుత్వ స్థలాలకు చెందిన డేటాను కలెక్ట్ చేస్తున్నామని అన్నారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ చెరువుల హద్దుల నిర్ణయించడం కోసం పని చేస్తుందని అన్నారు. 2000 సంవత్సరం 2006 సంవత్సరంలో ఉన్న సాంకేతిక డేటాను సేకరిస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. చెరువుల ఆక్రమణ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి, సంక్షేమ సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. నిర్మాణ వ్యర్థాలను చెరువులు నారల్లో వేస్తున్నారని చెప్పారు. అలాంటి పనులు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్
ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్ వేస్తామని రంగనాథ్ చెప్పారు. 12 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం త్వరలో చేపడతామని తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కోసం 36 టీములు ఉన్నాయని చెప్పారు. మరో 36 టీంలు సిద్ధమవుతున్నాయని అన్నారు. 4,500 ఫిర్యాదులు వచ్చాయని, 154 ఆటోమెటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి వాటి సంఖ్యను పెంచుతామని తెలిపారు.

ఒక ఎఫ్ఎం ఛానల్ పెడతామని, వెదర్ ఫోర్‌కాస్ట్, తర వివరాలు పబ్లిక్‌కు తెలియజేసేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఆక్రమణలపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత వచ్చిన పర్మిషన్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అంతకంటే ముందు కట్టిన నిర్మాణాల విషయంలో హైడ్రా ఇలాంటి చర్యలు తీసుకోదని తెలిపారు.

వ్యాపార సముదాయాలు ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటుందని అన్నారు. డీఆర్ఎఫ్ సిబ్బందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి అటాచ్ చేశామని తెలిపారు. నోటరీ డాక్యుమెంట్ల విషయంలో పబ్లిక్ కొంత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అక్రమ నిర్మాణం ఉంటే అలాంటి వాటిని కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

కొత్త సంవత్సరంలో ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. హైడ్రా ఎవరికి ఎన్వోసీలు ఇవ్వదని స్పష్టం చేశారు. మూసీలో అక్రమ నిర్మాణాలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు, హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు. చెరువులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన షేడ్స్ అద్దెకు తీసుకోవద్దని అన్నారు.

Modified Silencers: 350 లౌడ్‌ సైలెన్సర్లను రోడ్ రోలర్లతో తొక్కించిన పోలీసులు