Weather Update: నాలుగు రోజుల తరువాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: అప్పటి వరకు మండే ఎండలే

ఈప్రకారం జూన్ రెండో వారం నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అప్పటివరకు ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని..గాలిలో తేమ కారణంగా, వేడి కారణంగా ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది

Weather Update: నాలుగు రోజుల తరువాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: అప్పటి వరకు మండే ఎండలే

Weather

Updated On : June 3, 2022 / 12:59 PM IST

Weather Update: నాలుగు రోజుల తరువాతే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని..అప్పటి వరకు ఎండలు తీవ్రగానే కొనసాగుతాయని ఐఎండీ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఈమేరకు వాతావరణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా అరేబియా సముద్రం నుండి రుతుపవనాల పశ్చిమ గాలుల ప్రభావంతో, కోస్తా మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మహే మరియు లక్షద్వీప్‌లలో రాబోయే ఐదు రోజులలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. రాబోయే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది.

Other Stories: Vaccination in Telangana: తెలంగాణలో మరోసారి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు

ఈప్రకారం జూన్ రెండో వారం నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అప్పటివరకు ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని..గాలిలో తేమ కారణంగా, వేడి కారణంగా ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతుండగా అధికారులు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీల వరకు నమోదు అవుతుందని, కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 8 నాటికి తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని..వాతావరణశాఖ అంచనా వేసింది.

Other Stories: karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి