KTR On Hindi : హిందీ జాతీయ భాష కాదు, రుద్దితే ఊరుకోము, దేశానికి జాతీయ భాష ఏదీ లేదు-కేంద్రానికి కేటీఆర్ వార్నింగ్

హిందీ జాతీయ భాష కాదని, రుద్దితే ఊరుకోబోము అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. భారత దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదన్న కేటీఆర్.. అధికార భాషల్లో హిందీ ఒకటని గుర్తు చేశారు.

KTR On Hindi : హిందీ జాతీయ భాష కాదు, రుద్దితే ఊరుకోము, దేశానికి జాతీయ భాష ఏదీ లేదు-కేంద్రానికి కేటీఆర్ వార్నింగ్

Updated On : October 13, 2022 / 7:44 AM IST

KTR On Hindi : హిందీ జాతీయ భాష కాదని, రుద్దితే ఊరుకోబోము అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. భారత దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదన్న కేటీఆర్.. అధికార భాషల్లో హిందీ ఒకటని గుర్తు చేశారు.

ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారని, దీని వల్ల ఎన్డీయే ప్రభుత్వం సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలన్న కేటీఆర్, హిందీని బలవంతంగా రుద్దితే వ్యతిరేకిస్తామన్నారు.

ఐఐటీల్లో ఇంగ్లీష్ ని హిందీతో రీప్లేస్ చేయాలని, అన్ని సెంట్రల్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ తో పాటు సెంట్రల్ వర్సిటీల్లో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ కు బదులు హిందీని ప్రశేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సుపైన కేటీఆర్ స్పందించారు. ఈ నిర్ణయంపైన ట్వీట్ చేసిన కేటీఆర్.. ఆ తర్వాత ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. మాతృ భాషలో చదువుకున్న కోట్ల మంది ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు హిందీ భాష విషయంలో కేంద్రం వైఖరిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం సీరియస్ గా ఉన్నారు. స్టాలిన్ మరోసారి హిందీ భాషకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దవద్దని హెచ్చరిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. IITల వంటి సాంకేతిక, సాంకేతికేతర ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా మాధ్యమం హిందీ (హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో) ఉండాలని, ఇతర ప్రాంతాల్లో సంబంధిత స్థానిక భాషగా ఉండాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన కొద్ది గంటలకే స్టాలిన్ ఈ లేఖ రాశారు. అందులో హిందీని తప్పనిసరి చేస్తూ మరో భాషా యుద్ధానికి తావివ్వవద్దని కోరారు.

“భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అన్ని భాషలను సమానంగా చూడాలి. అన్ని భాషలను అధికార భాషలు అనే స్థాయికి మనం రావాలి. హిందీని రుద్దడం ద్వారా మరో భాషా యుద్ధం తీసుకు రావొద్దు. హిందీని తప్పనిసరి చేయడాన్ని ఆపాలని ప్రధాన మంత్రి, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. భారతదేశ ఐక్యతను కాపాడండి” అని లేఖలో కోరారు స్టాలిన్.

హిందీపై కేటీఆర్ ట్వీట్..