Rachakonda
supplying Rs 2 crore worth of cannabis : గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్టు అయ్యారు. ఇంటిలిజెన్స్ నుండి వచ్చిన సమాచారంతో గంజాయి ముఠాను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా, టాటా వాహనాలలో గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 2 కోట్ల 8 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు.
ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. గంజాయిని విశాఖపట్నం ఏరియా నుండి ముంబై మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపారు. 1240 కేజీల గంజాయిని సీజ్ చేశామని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు షేక్ యాసిన్ అలియాస్ ఫిరోజ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ ఈ దందా చేస్తున్నాడని తెలిపారు.
Bandi Sanjay : బండి సంజయ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
ప్రస్తుతం ఫిరోజ్ తో పాటు ఇద్దరు డ్రైవర్లు రవీందర్, మధు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి మూడు వాహనాలు, 5 వేల నగదు, 2 మొబైల్స్, 6 ప్లాస్టిక్ బ్యాగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ తోపాటు పిడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామని పేర్కొన్నారు.