Inturi Shekar: బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్‌ అరెస్ట్

ఎందుకు అరెస్టు చేశారు? కారణం చెప్పాలంటూ ఉన్నతాధికారులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రశ్నించారు.

Inturi Shekar

ఖమ్మం జిల్లాలో గత అర్ధరాత్రి పోలీసులు హైడ్రామా నడుమ డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్‌ను అరెస్టు చేశారు. కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువులో ఆలయ ఎండోమెంట్ భూముల విషయంలో అక్రమాలు చేటుచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారని ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఇంటూరి శేఖర్‌ను అరెస్టు చేయడం గమనార్హం. ఎందుకు అరెస్టు చేశారు? కారణం చెప్పాలంటూ ఉన్నతాధికారులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రశ్నించారు.

అక్రమ అరెస్టులను చట్టంముదు ఎదుర్కొటామని వ్యాఖ్యానించారు. నేలకొండపల్లి పీఎస్‌కి ఇంటూరి శేఖర్ ను పోలీసులు తరలించారు. పీఎస్ ఎదుట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఇంటూరి శేఖర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

MLA Kokkirala PremSagar Rao: సీఎం రేవంత్, భట్టివిక్రమార్కపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఆసక్తికర కామెంట్స్