చించావు పో : హీరోయిన్ రష్మికపై జగిత్యాల కలెక్టర్ వివాదాస్పద ట్వీట్

జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మిపై ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. రష్మిక ఫోటోకు ‘చించావు పో’ అని తన ట్విట్టర్ ఖాతా

  • Publish Date - February 20, 2020 / 06:32 AM IST

జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మిపై ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. రష్మిక ఫోటోకు ‘చించావు పో’ అని తన ట్విట్టర్ ఖాతా

జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మికపై ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. రష్మిక ఫోటోకు ‘చించావు పో రద్మిక’ అని తన ట్విట్టర్ ఖాతా నుంచి కామెంట్ పెట్టడం వివాదానికి దారితీసింది. జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్ చేయడం సెన్సేషన్ అయ్యింది. ఈ ట్వీట్ వివాదంపై కలెక్టర్ రవి స్పందించారు. ఆ కామెంట్ తాను చెయ్యలేదన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారని ఆరోపించారు. దీనిపై ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

కలెక్టర్ రవి ఖాతా నుంచి రష్మిక ఫోటోకు కామెంట్ రావడం చర్చకు దారితీసింది. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న ఆఫీసర్.. హీరోయిన్ ఫోటోకు ఇలా వ్యాఖ్యలు రాయడమేంటని నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇది గమనించిన కలెక్టర్.. వెంటనే స్పందించారు. ఇది తాను చేసిన పని కాదని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. లాంగ్ లెంగ్త్ స్కర్ట్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఖాతా నుంచి ‘చించావు పో’ అనే కామెంట్ వచ్చింది. ఈ ట్వీట్ వ్యవహారం సినీ పరిశ్రమలోనే కాదు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కలెక్టర్ మాత్రం.. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. మరి ఏది నిజమో ఏది అబద్దామో పోలీసుల విచారణలో తేలనుంది.

ఇక ట్వీట్ విషయానికి వస్తే.. అందులో చించావు పో రద్మిక అని ఉంది. రష్మిక బదులు రద్మిక అని ఉండటం ఆసక్తికరంగా మారింది. స్పెల్లింగ్ మిస్టేక్ నీట్ గా కనిపిస్తోంది. దీన్ని బట్టి.. ఆ ట్వీట్.. కలెక్టర్ చేసి ఉండరు అనే చర్చ జరుగుతోంది. కలెక్టరే అయి ఉంటే… రష్మిక స్పెల్లింగ్ ఎందుకు తప్పు రాస్తారు అని కొందరు వాదిస్తున్నారు. మొత్తంగా జగిత్యాల కలెక్టర్ రవి పేరు అందరి నోళ్లలో నానుతోంది. ఫైనల్ గా పోలీసుల ఏం చెబుతారో చూడాలి.

Read More>>బ్రహ్మచారి పేరు లవర్ బోయ్‌కి పెడతారా.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్..